Lord Venkateshwara : కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. తిరుమల కూడా ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని, అంతా శుభమే అని చాలా మంది భావిస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే సంపద కూడా బాగా పెరుగుతుంది. మీ జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయా..? ఆ కష్టాల నుండి గట్టెక్కాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విధంగా ముడుపు వేయండి. ఇక మీకు కుబేర కటాక్షమే.
చాలామంది ఏదైనా కష్టం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటుంటారు. ముడుపు కట్టే ముందు, కొన్ని నియమాలుని కచ్చితంగా పాటించాలి. ఇలా కనుక మీరు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు వేస్తే, ఖచ్చితంగా మంచే జరుగుతుంది. సమస్యలన్నీ పోతాయి. ఎంత కష్టమైనా సరే దాని నుండి బయటపడడానికి అవుతుంది. పరిహారం దొరుకుతుంది.
ముడుపు పెట్టడానికి ఒక తెలుపు వస్త్రం తీసుకోండి. పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి ఆరబెట్టండి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత పసుపు రంగు వస్త్రం కింద అయిపోతుంది. ఆ వస్త్రానికి, నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టాలి. 11 రూపాయలు, 21 కానీ 54 లేదంటే 108 రూపాయలు కానీ అందులో వేయండి. ఇప్పుడు మూట కట్టేసేయండి. మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి. మూడు ముళ్ళు వేసేటప్పుడు ఒక్కొక్క ముడి వేస్తూ మీ సమస్యలని చెప్పుకోండి. ఈ ముడి వేసే ముందు ఇంట్లో వినాయకుడి ఫోటో కి ప్రార్థన చేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి.
”ఓం గం గణపతయే నమః” అని 21 సార్లు చెప్పుకొని, వెంకటేశ్వర స్వామికి మీరు ముడుపు కడుతున్నట్లు చెప్పాలి. ఎంతటి కష్టమైనా సరే పోతుంది. మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ముడుపును పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాలు చదువుకోవాలి. అలానే గోవింద నామాలు చదవాలి. పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వాలి, ఇలా ముడుపును కట్టిన తర్వాత మీరు తిరుమల వెళ్లి ముడుపుని హుండీలో వేయాలి. ముడుపులో ఉన్న ధనంతో పాటుగా వడ్డీ కూడా వేయండి. ఇలా కనుక మీరు ముడుపుని చెల్లించారంటే, కచ్చితంగా కష్టమంతా కూడా పోతుంది. అలానే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించండి. సమస్యలన్నీ కూడా పోతాయి.