Nutmeg For Beauty : ప్రతి ఒక్కరు కూడా, అందమైన చర్మాన్ని పొందాలని అనుకుంటారు. మీరు కూడా అందంగా మారాలని అనుకుంటున్నారా..? అందంగా మారడం కోసం, చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని కొనుగోలు చేయాలంటే, ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇంటి చిట్కాలతో, మనం మన అందాన్ని పెంపొందించుకోవచ్చు. జాజికాయ అందుకు బాగా పనిచేస్తుంది. జాజికాయని ఉపయోగించడం వలన, కాంతివంతంగా మనం మన చర్మాన్ని మార్చుకోవచ్చు.
జాజికాయతో ఈరోజు ఎలా అందాన్ని పెంపొందించుకోవచ్చు, ఎలా నల్లని మచ్చలని దూరం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. జాజికాయ అందాన్ని పెంచడానికి, బాగా ఉపయోగపడుతుంది. ముఖం మీద నల్లని మచ్చలని మాయం చేస్తుంది. జాజికాయ ని వాడితే, నల్లని మచ్చలు కూడా ఈజీగా తొలగిపోతాయి. ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు వంటివి ఉన్నట్లయితే జాజికాయని ఇలా వాడడం మంచిది. మసాలా దినుసుగా వాడే, జాజికాయ చర్మ సౌందర్యాన్ని పెంపొందించగలదు.
పురాతన కాలం నుండి, చర్మ సంరక్షణలో జాజికాయని బాగా ఉపయోగించడం జరుగుతుంది. అలానే, ఒక పావు స్పూన్ చందనం పొడి కూడా వేయండి. ఈ రెండిటినీ నీటిలో వేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి, రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. అరగంట పాటు అలా వదిలేసి, తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే, మొటిమలు, నల్లని మచ్చలు తగ్గిపోతాయి. ఒక బౌల్ లో అర స్పూన్ తేనె వేసి, అందులో పావు స్పూన్ జాజికాయ పొడి వేసి, ముఖానికి పట్టించి, పావుగంట పాటు అలా వదిలేసి తర్వాత కడిగేసుకోండి. చర్మం కాంతివంతంగా మారుతుంది అందంగా ఉంటుంది, ఇలా అందాన్ని మనం పెంపొందించుకోవచ్చు. చక్కటి చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.