Problems : సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని పరిష్కరించుకునేందుకు ఎవరైనా సరే శ్రమిస్తుంటారు. అయితే కొందరికి మాత్రం సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దీంతో వాటిని తట్టుకోలేక తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పును కొన్ని విధాలుగా ఉపయోగిస్తే.. దాంతో ఇంట్లో ఎవరికైనా సరే ఉండే సమస్యలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.
చాలా మందిని ఆర్థిక, మానసిక, ఇతర సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అలాంటి వారు కొన్ని సూచనలను పాటించడం వల్ల ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఇలా సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంది. దీన్నే కొందరు సముద్రపు ఉప్పు అని, గల్లుప్పు అని అంటుంటారు. దీంతో కొన్ని సూచనలు పాటిస్తే ఇంట్లోని వారికి ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. మరి అందుకు ఏం చేయాలంటే..
ఒక గాజు పాత్రను తీసుకుని అందులో వంటకు ఉపయోగించే రాళ్ళ ఉప్పును కొద్దిగా వేయాలి. ఆ పాత్రను స్నానపు గది అలమారాలో పై భాగంలో ఉంచాలి. ఈ పాత్రపై నీరు పడకుండా మూత పెట్టాలి. దీంతో ఆ ఉప్పు కొద్ది రోజుల్లో కరిగిపోతుంది. ఉప్పు కరిగిన తరువాత దాన్ని తీసేసి మళ్లీ ఉప్పు వేసి పెట్టాలి. దీంతో ఇంటికి ఉండే దృష్టి లోపాలు తగ్గుతాయి. దారిద్ర్యం నుంచి బయట పడవచ్చు.
ఇంటిని శుభ్ర పరిచే నీటిలో పసుపు, రాళ్ల ఉప్పును కలిపి ఇంటిని శుభ్రం చేయాలి. దీంతో ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు పోతాయి. మంచి ఫలితాలు కలుగుతాయి. అధికంగా ఆదాయం లభిస్తుంది.
పర్సుల్లో చిటికెడు రాళ్ల ఉప్పును పేపర్‌లో మడతపెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే.. విభేదాలు తొలగిపోవాలంటే బెడ్‌రూమ్‌లో అలమారాలో లేదా ఏదైనా ఒక చోట రాళ్ల ఉప్పును నింపిన గాజు పాత్రను ఉంచి దానిపై మూత పెట్టాలి. వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చాలి. దీంతో భార్యాభర్యల మధ్య ఉండే కలహాలు తగ్గుతాయి. అన్యోన్యంగా ఉంటారు.
వాహనాలను శుభ్ర పరిచే నీటిలోనూ కొద్దిగా రాళ్ల ఉప్పును కలిపి శుభ్రం చేయాలి. దీంతో వాహనాలపై ఉండే దోషాలు పోతాయి. ప్రమాదాలు కాకుండా ఉంటాయి. స్నానం చేసే నీటిలోనూ రాళ్ల ఉప్పును వేసి స్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఇబ్బందులు పోతాయి. సానుకూల ప్రభావం ఉంటుంది.