Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

నిద్ర మరీ ఎక్కువైనా లేదా త‌క్కువైనా ప్ర‌మాద‌మే..!

Admin by Admin
July 10, 2025
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శరీరానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి కారణంగా బరువు పెరగడం, గుండె సమస్యలు, టైప్‌-2 డయాబెటిస్‌, ఇమ్యూనిటీ తగ్గడం, ఒత్తిడి, జుట్టు ఊడటం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి ఎన్నో సమస్యలొస్తాయి. నిద్ర ఆరోగ్యానికి మంచిదని కొంతమంది గంటల తరబడి నిద్రపోతూ ఉంటారు. నిద్ర తగ్గితేనే కాదు, ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ నివేదిక ప్రకారం, ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మీరు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని వెల్లడించింది. ఎవరైనా, ఎల్లప్పుడూ నిద్రపోవడానికి ఆవకాశం కోసం ఎదురు చూస్తుంటే.. కచ్చితంగా డాక్టర్‌‌‌ను సంప్రదించడం మంచిదని జాన్స్ హాప్‌కిన్స్ మెడిసిన్ ప్రొఫెసర్ Vsevolod Polotsky అన్నారు. నిద్ర సమయం ప్రతి వ్యక్తికీ మారవచ్చుసాధారణంగా పెద్ద వారికి రాత్రుళ్లు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరమవుతుంది.

అయితే కొంతమంది సమయం దొరికితే చాలు, తొమ్మిది గంటలకు మించి మరీ నిద్రపోతుంటారు. దీన్నే అతి నిద్ర, హైపర్సోమ్నియా అంటారు. ఒకవేళ, మీరు 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతుంటే.. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా నిద్రపోయిన, నిద్ర తక్కువగా ఉన్నా.. బరువు పెరుగుతారు. ప్రతి రోజూ రాత్రి తొమ్మిది, దాని కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు.. ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య నిద్రపోయే వారి కంటే ఆరేళ్ల కాలంలో ఊబకాయానికి గురయ్యే అవకాశం 21% ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల.. రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది, శరీరంలో ఇన్సులిన్‌‌ ఉత్పత్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల డయాబెటిస్‌‌‌‌‌‌‌ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా నిద్రపోయేవారిలో.. టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు అంటున్నారు. అతి నిద్రకు, డిప్రెషన్‌కు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.

over or less sleep two both are unhealthy

డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో 15% మంది ఎక్కువగా నిద్రపోతారని అంటున్నారు. అతి నిద్ర డిప్రెషన్‌ను తీవ్రతరం చేస్తుందని ప్రేర్కొంటున్నారు. డ్రిప్రెషన్‌ నుంచి బయటకు రావడానికి ఆరోగ్యకరమైన నిద్ర ముఖ్యం. అతినిద్ర వల్ల కూడా పలు మానసిక అనారోగ్యాలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రాత్రి సమయంలో ఎనిమిది గంటలు నిద్రపోయే స్త్రీల కంటే.. తొమ్మిది నుంచి 11 గంటలు నిద్రపోయే స్త్రీలకు కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం 38% ఎక్కువగా ఉందని నర్సెస్‌ హెల్త్‌ సర్వే చెబుతోంది. ఈ అధ్యయనంలో దాదాపు 72,000 మంది మహిళలను పరిశీలించారు. తొమ్మిది గంటలకు మించి నిద్ర పోవడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదమూ 23 శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి నిద్ర వల్ల మెదడుకు అందే రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం పడడమే ఇందుకు ప్రధాన కారణమ‌ని అంటున్నారు.

Tags: sleep
Previous Post

అహ నా పెళ్లంట సినిమాలో కోట పాత్ర వెనుక ఇంత క‌థ ఉందా..?

Next Post

డ‌యాబెటిస్ ఉన్న‌వారు రాత్రి పూట ఇలా చేస్తే షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

Related Posts

వ్యాయామం

ఎక్స‌ర్‌సైజ్ చేసే వారు స‌డెన్‌గా దాన్ని ఆపేస్తే… లావై పోతారా? ఇందులో నిజమెంత??

July 12, 2025
హెల్త్ టిప్స్

మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు?.. 6 గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
హెల్త్ టిప్స్

చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 12, 2025
పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

బైపాస్ సర్జ‌రీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

July 12, 2025
హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.