ఇక పై విమాన ప్రయాణంలో నిల్చుని కూడా మనం ప్రయాణం చేయవచ్చునట.. ఇది 2026 నుండి అందుబాటులోనికి రావచ్చునట. ఇది వాస్తవమేనా ? అవును నేనూ చదివాను, 2026 నుంచి కొన్ని బడ్జెట్ ఎయిర్‌లైన్లు ప్రయాణికుల కోసం స్టాండింగ్-ఓన్లీ సీట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవి పూర్తిగా నిలబడే సీట్లు కాకుండా, ప్రయాణికులు సైకిల్ సీట్ లాంటి సీటుపై సగం కూర్చుని బ్యాక్ సపోర్ట్ తో, సీటుబెల్ట్‌తో సేఫ్ గా ఉండేలా రూపొందించారు.ఈ సీటు ను ఇటాలియన్ మ్యానుఫ్యాక్చరర్ Avio interiors డిజైన్ చేసారు. దానికి Skyrider 2.0 అని పేరు పెట్టారు.
పాసెంజర్ లేదా ప్రయాణికుడు సుమారు 45° కోణంలో వాల్చి, సీటుబెల్ట్‌తో సురక్షితంగా ఉండే విధంగా తయారు చేసారు. ఈ సీట్లు మామూలు ఎకానమీ సీట్ల కంటే 50% తక్కువ బరువు కలిగి తక్కువ స్థలంలో 20% ఎక్కువ ప్రయాణికులను కూర్చోబెట్టే అవకాశం ఇస్తాయట. బడ్జెట్ లేదా low cost ఎయిర్‌లైన్లు ఈ సీట్లను ఉపయోగించి ప్రయాణికుల సంఖ్యను సుమారు 20% పెంచుకోవచ్చు. దీంతో టికెట్ ధరలు తగ్గి occupancy పెరుగుతుందని అనుకొంటున్నారు.
ఈ సీట్లు సురక్షితత పరీక్షలు పూర్తి చేసినప్పటికీ, టర్బులెన్స్ లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యం, సురక్షితతపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ సీట్లు ప్రధానంగా 2 గంటల లోపు ఉన్న షార్ట్-హాల్ విమాన ప్రయాణాలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
చివరగా ఈ సీటును 50% బరువు తక్కువ, 20% ఎక్కువ ప్రయాణికులను accomodate చేస్తాయి, తక్కువ ఖర్చుతో 2 గంటల లోపు ప్రయాణానికి అనుకూలం.