పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ధైర్యం వస్తుంది.. ఆయనలో ఏముందో ఏమో కానీ , తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ సంపాదించుకున్నారు.. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా కానీ తన సొంత టాలెంట్ తో పవర్ స్టార్ గా మారారు. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు..
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక చిత్రాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా దర్శకుడు సుజిత్ తో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ (ఓజీ) అనే స్టోరీతో ఓ సినిమా తీస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన బీజీఎం మ్యూజిక్ పవన్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా సినీ అభిమానులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.
దీంతో ఈ మూవీపై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే చరిత్ర సృష్టించబోతుందని ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించే పాత్ర లేదని, హీరోయిన్ రోల్ ను పెట్టడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ బంగారం అనే మూవీలోనూ హీరోయిన్ లేకుండానే యాక్ట్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే ఓజీ మూవీని కూడా హీరోయిన్ లేకుండానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఉండవని అంటున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ సాంగ్స్, హీరోయిన్ లేకుండా తొలిసారి ప్రయోగం చేస్తున్నారని తెలుస్తుండడంతో ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురవుతున్నారు. అయినప్పటికీ స్టోరీ బాగుంటే సాంగ్స్, హీరోయిన్‌తో పనిలేదు. అవి కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే అని కొందరంటున్నారు. మరి ఓజీ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.