కులం, ఈ మాట వినగానే కొంతమందికి కోపం, కొంతమందికి గర్వం. వీడు మనవాడు, వీళ్ళు మనవాళ్లు కాదు అని ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ కుల వ్యవస్థ మన సామాన్య ప్రజల నుండి మనల్ని పాలన చేసే రాజకీయ నాయకులు వరకు ఉంది. అయితే ఈ కుల వ్యవస్థ తో పెళ్లిళ్లు కూడా మా కులం వాళ్లనే చేసుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తుంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వారు కొన్నిసార్లు ఫైట్ చేయలేక, అప్పుడప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెట్టలేక, ఇంట్లో చూసిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అయితే మన టాలీవుడ్ హీరోలు తారలు మాత్రం కులాంతర వివాహాలు చేసుకున్నారు. అయితే ఆ తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం. మహేష్ లాంటి హ్యాండ్సమ్ హీరోకి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మహేష్ ని ప్రేమించేలా చేసింది నమ్రత. నార్త్ ఇండియన్ అయినా నమ్రతది వేరే కులమైన ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు మహేష్.
మెగాస్టార్ కొడుకుగా అప్పటికే సినిమాల్లో సూపర్ ఫామ్ లో ఉన్న చరణ్ ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది అందరికీ ఉండేది. కానీ చరణ్ కూడా ప్రేమ వివాహానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అది కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఉపాసన కామినేనిని పెళ్లి చేసుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది కూడా ప్రేమ వివాహమే. కులాంతర వివాహమే చేసుకున్నాడు. తన తండ్రిని ఒప్పించి మరి స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. అక్కినేని నాగార్జున ఎప్పటికీ వయసులో తగ్గడు అంటారు. అలాంటి నాగ్ ని ప్రేమలో పడేసింది అమల. కిరాయి దాదా షూటింగ్ టైం లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ పర్మిషన్ తో పెళ్లి చేసుకున్నారు. అమలా నార్త్ ఇండియన్ అయినా కూడా ఇక్కడ సాంప్రదాయం తోనే పెళ్లి చేసుకున్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంత ఫాస్ట్ గా సినిమాలు తీస్తాడో అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి జగన్ ఒకరోజు షూటింగ్ లో లావణ్యని చూసే ప్రేమలో పడ్డారు. ఎవరికీ తెలియకుండానే పెళ్లి చేసుకొని ఇప్పుడు కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. సుహాసిని మణిరత్నం తెలుగులో అప్పటికే టాప్ హీరోయిన్. అయితే మణిరత్నంని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిది కూడా కులాంతర వివాహమే.