మన దేశం లోని అన్ని భాషలలో కెల్ల ఒక్క , కేవలం ఒక్క తెలుగు చిత్రసీమ లోనే హీరో ఎంట్రీ లు ఇంప్రెస్సీవ్‌గా, పవర్‌ఫుల్‌గా ప్రేక్షకులు నోళ్లు తెరుచుకొని చూసేట్టు తీసే డైరెక్టర్లు మన సినిమాల్లోనే ఉన్నారు! ఇది నిజం, మన డైరెక్టర్లు ఇలాంటి హీరో ఎంట్రీ సీన్లు తీయటం లో పండిపోయారు, మన తెలుగు సినిమాల దరిదాపుల్లోకి ఏ భాషల్లోనా లేరు. ఇప్పుడిప్పుడు మన ఎంట్రీ సీన్లు , మన లాంటి ఫైటింగ్ సీన్లు కూడా మిగితా వారు ప్రయత్నిస్తున్నారు, మన ఫైట్మాష్టర్లు ఇంకా డాన్సు డైరెక్టర్లు కూడా మంచి టాలెంటెడ్ వాళ్లున్నారని మిగతా భాషల వాళ్లు కూడా మెచ్చుకోవటం, దేశమ్మొత్తమీద మన తెలుగు చిత్రాలనే ఆదరించటం అందరికీ తెలిసిందే !!
ఏ సినిమాకు ఆ సినిమానే జబర్దస్త్ ఎంట్రీ సీన్లను కలిగి ఉన్నాయి. అలా మనకు బాగా గుర్తుండిపోయినవాటిలో పోకిరి. ఇందులో మహేష్ మీద కూరగాయలు జల్లుగా పడటం. ఇక పూలు పడటం ఇలా చాలా వాటిలో దిగుమతి చేసుకున్నారు. మగధీరలో పూర్వజన్మ లోని హీరో ఎంట్రీ సీను అలాంటిది. ఎవ్వరు మరువలేరు, రాజమౌళి మళ్లీ బాహుబలి లోనూ , అదే సీను సైరాలోను సురేందర్‌రెడ్డి మొమాట పడ కుండా ఉపయోగించుకున్నారు.
కానీ నాకు ఎన్నో సినిమాలలో కన్నా బెస్ట్ అనిపించింది వీటిల్లో నిష్ణాతుడైన మురుగ దాస్ స్టాలిన్ లోని హీరో ఎంట్రీ సీన్. కారు అద్దం రంధ్రం లో నుండి చిరు కళ్లు తెరనిండా చూపడము, హీరో ను మొదటగా తెరనిండా బూట్లు చూపించటము చూస్తుంటే జూరాసిక్ పార్కులో డైనోసార్ అడుగు లేయటం తన కళ్లతో శతృవులకోసం వెతకటం సన్నివేశాల్లాగా నుండి , ఎప్పటికి గుర్తుకు వస్తూ ఉంటుంది! నా ఉద్ధ్యేశ్యంలో అత్యుత్తమ ఎంట్రీ సీన్ ఇదే.: కారణం ఎప్పుడు ఈ సీనే గుర్తుకొస్తుంది కాబట్టి!