Silver Jewelry : భారతీయులకు సహజంగానే బంగారంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను ధరించేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే బంగారానికే అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అయితే వాస్తవానికి వెండి ఆభరణాలను కూడా ధరించవచ్చు. వీటితో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారంలాగే ఎంతో పురాతన కాలం నుంచి వెండిని కూడా ప్రజలు ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే వెండిని ఆభరణాల కింద చాలా తక్కువగా వాడుతారు. వెండిని ఇంట్లో సామగ్రి కింద చేసి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వెండి ఆభరణాలను కూడా ధరించాలి. వెండిలో శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లపై పోరాటం చేస్తాయి. దగ్గు, జలుబు, ఫ్లూ రాకుండా చూస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. కాబట్టి వెండి ఆభరణాలను ధరించాలి.
కొందరికి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అలాటిం వారు వెండి ఆభరణాలను ధరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. వెండి ఆభరణాలను ధరించడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. శరీర ఉష్ణోగ్రత, హార్మోన్లు సరైన స్థాయిలో ఉంటాయి.
వెండి ఆభరణాలను ధరిస్తే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పురాతన కాలంలో వ్యాధులు వచ్చిన వారు ఎక్కువగా వెండి ఆభరణాలను ధరించి వాటిని తగ్గించుకునేవారు. ఇక ఆధ్యాత్మికంగా కూడా వెండి చాలా మంచిది.
వెండికి దుష్ట శక్తులు దూరంగా ఉంటాయి. వెండి ఆభరణాలను ధరిస్తే శరీరంపై దుష్ట శక్తుల ప్రభావం ఉండదు. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు రక్త నాళాలు సాగినట్లు అవుతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. వెండి వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. మృతకణాలు పోతాయి. చర్మ కణాలకు మరమ్మత్తులు జరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
వెండి ఆభరణాలు పలు రసాయనాలకు ప్రభావితం అవుతాయి. వాటిని మీరు ధరిస్తే అవి నీలి రంగులోకి మారితే.. మీ శరీరంలో సోడియం అధికంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. దీని వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. కనుక సోడియం స్థాయిలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
ఇక వెండి ఆభరణాల వల్ల మనపై పడే రేడియేషన్ ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో క్యాన్సర్ వంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
అయితే కొందరికి వెండి ఆభరణాలను ధరిస్తే చర్మంపై అలర్జీలు, దురదలు వస్తాయి. అలాంటి వారు ఈ ఆభరణాలను వెంటనే తీసేయాలి.