Hyderabad Style Chicken Curry : చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా రావాలంటే.. ఇలా చేయండి.. రైస్ లోకి అదిరిపోతోంది..

Hyderabad Style Chicken Curry : మాంసాహార ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చికెన్ తో మ‌నం ఎక్కువ‌గా చికెన్ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. ఈ చికెన్ క‌ర్రీని వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా, సుల‌భంగా ఈ చికెన్ క‌ర్రీని హైద‌రాబాదీ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హైద‌రాబాద్ స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ట‌మాటాలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, చికెన్ మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – కొద్దిగా, ఎండుమిర్చి – 2, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్.

Hyderabad Style Chicken Curry recipe in telugu very tasty
Hyderabad Style Chicken Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, సార ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, యాల‌కులు – 3, ల‌వంగాలు – 4.

హైద‌రాబాదీ స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ఎండుమిర్చి, మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన దినుసులు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో చికెన్ ను వేసి వేయించాలి. చికెన్ స‌గానికి పైగా వేగిన త‌రువాత అల్లంవెల్లుల్లి పేస్ట్, ట‌మాట ముక్క‌లు వేసి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర‌, క‌సూరి మెంతి, మిరియాల పొడి, చికెన్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ముందుగా వేయించిన ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాదీ స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, పులావ్ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఈ చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts