Vankaya Kothimeera Karam Kura : వంకాయలతో చేసే కూరలు అంటే చాలా మంది సహజంగానే ఇష్టంగా తింటుంటారు. మనకు వంకాయలు వివిధ రకాల వెరైటీల్లో లభిస్తుంటాయి. తెల్లవి, నల్లవి, పొడుగ్గా ఉన్నవి, చిన్నగా ఉన్నవి.. లభిస్తుంటాయి. అందులో భాగంగానే ఎవరైనా సరే తమకు నచ్చిన విధంగా వంకాయలను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే గుత్తి వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ వంకాయలతో మనం కొత్తిమీర కారం కూరను కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ కొత్తిమీర కారం కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు లేతవి – 8, కొత్తిమీర – ఒక కట్ట, పచ్చి మిర్చి – 8, పసుపు – చిటికెడు, నూనె, ఉప్పు – తగినంత.
వంకాయ కొత్తిమీర కారం కూరను తయారు చేసే విధానం..
వంకాయల్ని గుత్తులుగా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్లలో వేయాలి. కొత్తిమీర, ఉప్పు, పచ్చి మిర్చి కలిపి మెత్తగా నూరుకోవాలి. వంకాయ గుత్తుల్లో ఈ కొత్తిమీర కారం నిండుగా కూరి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి కాగిన తరువాత ఒక్కో వంకాయని వేసి సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. ఈ కూర చల్లారితే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. దేంతో అయినా సరే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.