Daily One Spoon Fennel Seeds : మనలో చాలా మంది, భోజనం చేసిన వెంటనే, సోంపు గింజలను నోట్లో వేసుకుని, నమిలి తింటుంటారు. సోంపు గింజలను నమలడం వల్ల, నోరు తాజాగా మారుతుంది. నోటి దుర్వాసన పోతుంది. ఎక్కువ శాతం మంది మాంసాహారం తిన్నప్పుడు, సోంపు గింజలను నములుతుంటారు. అయితే వాస్తవానికి సోంపు గింజలతో మనకు, ఎన్నో అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. సోంపు గింజలను తినడం వల్ల, ఎన్నో లాభాలను పొందవచ్చు. రోజూ ఒక టీస్పూన్ మోతాదులో, ఈ గింజలను తిన్నా చాలు, అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. సోంపు గింజలను రోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు గింజల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ గింజల్లో విటమిన్లు సీ, ఈ, కే వంటివి అధికంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం, మెగ్నిషియం, జింక్, పొటాషియం, సెలీనియం, ఐరన్ వంటివి అధికంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ మనల్ని రోగాల బారి నుంచి సురక్షితంగా ఉంచుతాయి. వ్యాధులను తగ్గిస్తాయి. సోంపు గింజలను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. జీర్ణాశయం, పేగులను శుభ్రంగా ఉంచుతుంది. ఆయా అవయవాల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. అలాగే గ్యాస్ ఉండదు. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే అజీర్ణం, కడుపులో మంట, మలబద్దకం తగ్గుతాయి. రోజూ మలబద్దకంతో బాధపడేవారికి సోంపు గింజలు అద్భుతమైన మెడిసిన్ అని చెప్పవచ్చు. వీటిని రోజూ తింటే ఆయా సమస్యలు తగ్గుతాయి.
సోంపు గింజల్లో ఉండే విటమిన్లు సీ, ఈ, యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు రావు. యవ్వనంగా కనిపిస్తారు. ఈ గింజలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.
శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు రోజూ ఒక్క టీస్పూన్ మోతాదులో సోంపు గింజలను తింటే ఫలితం ఉంటుంది. దీని వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. కఫం పోతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ గింజలను తినడం వల్ల బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. పిల్లలకు పోషణ లభిస్తుంది. చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ గింజలను తినడం వల్ల రక్త శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్థాలు పోతాయి. దీంతో స్కిన్ అలర్జీలు తగ్గుతాయి. ఇక ఈ గింజలను తినడం వల్ల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
సోంపు గింజలను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ గింజలను రోజూ తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే దంతాలు, నోరు, చిగుళ్లు క్లీన్ అవుతాయి. బాక్టీరియా నశిస్తుంది. దీంతో దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా సోంపు గింజలను రోజూ తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తినడం మరిచిపోకండి.