Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Drinking Water After Food : భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.. ఈ 3 కార‌ణాల‌ను తెలుసుకోండి..!

Editor by Editor
August 19, 2024
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Drinking Water After Food : మ‌న దేశంలో అల్లోప‌తి మందులు రాక‌ముందే ఎంతో పురాత‌న కాలం నుంచే ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉంది. ఇప్ప‌టికీ చాలా మంది ఆయుర్వేద వైద్యాన్నే ఫాలో అవుతుంటారు. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది అల్లోప‌తికి బ‌దులుగా ఆయుర్వేదం ద్వారా త‌మ రోగాల‌ను న‌యం చేసుకుంటున్నారు. అయితే ఆయుర్వేదంలో మ‌న ఆరోగ్యం గురించి అనేక విష‌యాల‌ను చెప్పారు. ముఖ్యంగా భోజ‌నం చేసే స‌మ‌యంలో నీళ్ల‌ను తాగ‌డం గురించి ఆయుర్వేదంలో వివ‌రించారు. భోజ‌నం చేసే ముందు కానీ, భోజ‌నం చేసేట‌ప్పుడు కానీ, చేశాక కానీ వెంట‌నే నీళ్ల‌ను తాగ‌కూడ‌ద‌ని ఆయుర్వేదం చెబుతోంది. అయితే దీని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు చూద్దాం.

మ‌నం భోజ‌నం చేసిన‌ప్పుడు తినే ఆహారాలు జీర్ణాశ‌యంలోకి చేర‌గానే అక్క‌డ ప‌లు ఎంజైమ్‌ల‌తోపాటు యాసిడ్లు కూడా ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి మ‌న‌కు పోష‌కాల‌ను, శ‌క్తిని అందిస్తాయి. అయితే అదే స‌మ‌యంలో మ‌నం భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల ఆయా ఎంజైమ్‌లు, యాసిడ్ల ప్రభావం త‌గ్గిపోతుంది. దీంతో అవి స‌రిగ్గా ప‌నిచేయవు. ఫ‌లితంగా మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక అజీర్తి స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. దీంతోపాటు గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం కూడా వ‌స్తాయి. క‌నుక భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగ‌డం మంచిది కాదు.

Drinking Water After Food immediately is unhealthy to us know the 3 reasons
Drinking Water After Food

అధికంగా బ‌రువు పెరుగుతారు..

ఇక భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే నీళ్ల‌ను తాగితే మ‌న పొట్ట‌లో నీళ్లు ఎక్కువ‌గా చేరుతాయి. దీని వ‌ల్ల ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక శ‌రీరానికి శ‌క్తి అంద‌దు. ఫ‌లితంగా మ‌న మెద‌డు మ‌ళ్లీ ఆహారం తినాల‌ని జీర్ణాశ‌యానికి సంకేతం పంపిస్తుంది. దీంతో మ‌న‌కు ఆక‌లి అవుతుంది. అప్పుడు మ‌ళ్లీ ఆహారం తింటాం. ఇలా మ‌నం ఎక్కువ సార్లు ఆహారం తినాల్సి వ‌స్తుంది. దీంతో శ‌రీరంలో చేరే క్యాల‌రీలు పెరిగిపోతాయి. ఫ‌లితంగా అధికంగా బ‌రువు పెరిగిపోతారు. క‌నుక ఆహారం తినే స‌మ‌యంలో లేదా తిన్న వెంట‌నే అస‌లు నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.

మనం భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకోలేదు. దీంతో పోష‌కాహార లోపం ఏర్ప‌డుతుంది. ముఖ్యంగా ఐర‌న్‌, విట‌మిన్ బి12, క్యాల్షియం వంటివి మ‌న‌కు స‌రిగ్గా ల‌భించ‌వు. దీంతో ఆయా పోష‌కాల లోపం వ‌స్తుంది. దీని వ‌ల్ల మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక ఎవ‌రైనా స‌రే భోజ‌నానికి ముందు లేదా భోజ‌నం చేసే స‌మ‌యంలో లేదా భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను అస‌లు తాగ‌కూడదు. భోజ‌నం చేయ‌డానికి క‌నీసం 30 నిమిషాల ముందు నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు. భోజ‌నం చేశాక 30 నిమిషాలు ఆగి నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు. అయితే కొంద‌రికి భోజ‌నం చేసే స‌మ‌యంలో గొంతు పట్టుకుపోయిన‌ట్లు అవుతుంది. అలాంట‌ప్పుడు కాస్త నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు. అంతేకానీ.. భారీ ఎత్తున నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.

త‌ప్ప‌క జాగ్రత్త‌ల‌ను పాటించాలి..

ఇలా ఆయుర్వేదం మ‌న‌కు నీళ్ల‌ను తాగే విష‌యంలో అనేక సూత్రాల‌ను తెలియజేసింది. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ ఈ సూత్రాల‌ను పాటించ‌డం వ‌ల్ల దాదాపుగా అనేక రోగాల‌ను రాకుండా చూసుకోవ‌చ్చు. నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోతే ఆయుర్వేద ప్ర‌కారం శ‌రీరంలో వాత‌, పిత్త‌, క‌ఫ దోషాల్లో అస‌మ‌తుల్య‌త‌లు ఏర్ప‌డుతాయి. దీంతో మ‌న‌కు వ్యాధులు వ‌స్తాయి. క‌నుక భోజనం చేసే స‌మ‌యంలో నీళ్ల‌ను తాగే విష‌యంపై ప్ర‌తి ఒక్క‌రు పైన చెప్పిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే వ్యాధుల‌ను కొని తెచ్చుకున్న వారు అవుతారు.

Tags: Drinking Water After Food
Previous Post

How To Take Moringa Leaves Powder : మున‌గాకుల పొడిని ఎలా తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..?

Next Post

Nutmeg Powder : జాజికాయ పొడిని ఇలా తీసుకుంటే ఎన్నో వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.