అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించేందుకు చాలా కష్టపడుతున్నారు. వ్యాయామం చేయడం, గంటల తరబడి జిమ్‌లలో గడపడం, పౌష్టికాహారం తీసుకోవడం చేస్తున్నారు. కానీ వాటితోపాటు కింద తెలిపిన పలు సూచనలను పాటించడం వల్ల అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
1. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పెప్పర్ మింట్ టీ లేదా దాల్చిన చెక్క డికాషన్‌ను తాగాలి. వీటి వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. మనం నిద్రించేటప్పుడు కూడా క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
2. రాత్రి పూట సహజంగానే చాలా మంది మద్యం సేవిస్తుంటారు. కానీ దీని వల్ల శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. శరీరంలో ఉండే మద్యాన్ని బయటకు పంపేందుకు శరీరం బాగా కష్టపడుతుంది. దీంతో ఇతర క్రియలను నిర్వర్తించలేదు. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. కనుక రాత్రి మద్యం మానేయడం వల్ల బరువును వేగంగా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.
3. రాత్రి పూట సహజంగానే మనం ఏ పని చేయం. కనుక శక్తి కూడా తక్కువగా అవసరం అవుతుంది. కనుక రాత్రి చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. రాత్రి 7.30 గంటల లోపు భోజనం ముగించాలి. రాత్రి భోజనంలో పిండి పదార్థాలు కాకుండా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. రాత్రి శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది కనుక ఆ ప్రోటీన్లు ఉపయోగపడతాయి. అలాగే పండ్లు, వెజిటబుల్ సలాడ్, పాలు వంటివి తీసుకోవడం మేలు. ఇవి పోషకాలను అందిస్తాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. బరువు తగ్గేందుకు దోహదపడతాయి.
4. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. అది కొవ్వుగా మారుతుంది. కనుక రాత్రి వీలైనంత త్వరగా భోజనం ముగించడం మంచిది. దీంతో బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.
5. రాత్రి పూట కొందరు భోజనంతోపాటు చిప్స్ వంటి స్నాక్స్ తింటారు. ఇది ప్రమాకరం. కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. వాటిని తినరాదు. అందుకు బదులుగా పండ్లు తింటే మేలు.
ఈ సూచనలు పాటించడం వల్ల బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.