వేరుశెనగలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ కాయలను ఉడకబెట్టుకుని తినడం అంటే చాలా మందికి ఇష్టం. వేరుశెనగలను నిత్యం వంటల్లో వేస్తుంటారు. వీటితో చట్నీలు, కూరలు చేసుకోవచ్చు. అయితే రోజూ వీటిని నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. బాదంపప్పును నానబెట్టి తినలేమని అనుకునేవారు వీటిని అలా తినవచ్చు. రోజూ రాత్రి ఒక కప్పు మోతాదులో వేరుశెనగలను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని పరగడుపునే తినాలి. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నానబెట్టిన వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
2. రోజూ వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి నానబెట్టిన వేరుశెనగలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి శక్తిని అందిస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదపడతాయి. రోజంతా నీరసంగా, బలహీనంగా ఉంటుందని భావించే వారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగలను తింటే మంచిది. దీంతో శక్తి అంది ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు.
3. వేరుశెనగల్లో పొటాషియం, మాంగనీస్, కాపర్, కాల్షియం, ఐరన్, సెలీనియం అధికంగా ఉంటాయి. దీని వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
4. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఉన్నవారు రోజూ వేరుశెనగలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. రోజూ ఉదయాన్నే వేరుశెనగలను చిన్నారులకు తినిపించడం వల్ల పోషణ అందుతుంది. వారిలో కంటి చూపు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది. శక్తి లభిస్తుంది. చదువుల్లో, క్రీడల్లో యాక్టివ్‌గా రాణిస్తారు.
6. వేరుశెనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తాయి. అందువల్ల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
7. వేరుశెనగల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365