Horse Gram For Nerves : మన శరీరంలో సక్రమంగా తన పని తాను చేసుకోవాలంటే మన శరీరంలో ఉండే మెదడుతో పాటు నరాలు కూడా సక్రమంగా పని చేయాలి. మెదడు మరియు నరాలు సక్రమంగా పని చేస్తేనే శరీరంలో జీవక్రియలు సక్రమంగా పని చేస్తాయి. ఈ కణాలలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగేలా చూసుకోవాలి. సాధారణంగా మెదడు కణాలు ఒకసారి అభివృద్ది చెందిన తరువాత జీవితాంతం అవే ఉంటాయి. మెదడు కణాలు నశించడం వాటి స్థానంలో కొత్తవి పుట్టడం జరగవు. అలాగే నరాల కణాలు కూడా ఒకసారి దెబ్బతింటే అవి మరలా సాధారణ స్థితికి రావడం అంటూ ఉండదు. కనుక మనం మెదడు కణాలతో పాటు నరాల కణాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
మెదడు కణాలను, నరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉలవలు మనకు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. మెదడు కణాలపై, నరాల కణాలపై హానికలిగించే రసాయనాలు, ప్రోటీన్స్ పేరుకుపోతూ ఉంటాయి. ఇవి క్రమంగా కణాలు దెబ్బతినేలా చేస్తాయి. ఇలా కణాలపై పేరుకుపోయిన ప్రోటీన్స్ ను, రసాయనాలను తొలగించడంలో ఉలవలు మనకు సహాయపడతాయి. ఉలవల్లో ఇనులిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఉలవలను మనం తినప్పుడు మన ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఈ ఇనులిన్ ను పులియబెట్టి స్కీనో ఇనోసిటాల్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ స్కీనో ఇనోసిటాల్ కణాలపై పేరుకుపోయిన రసాయనాలను, ప్రోటీన్స్ ను తొలగించి కణాలను రక్షించడంలో ఎంతగానో దోహదపడుతుంది.

అదే విధంగా ఉలవలను తినడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ మెదడు కణాలకు, నరాల కణాలకు సక్రమంగా చేరుతుంది. దీంతో ఈ కణాలు చురుకుగా పని చేస్తాయి. మెదడు కణాలు, నరాల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా ఉలవలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంతో పాటు శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో కూడా సహాయపడతాయి. ఉలవలను తినడం వల్ల శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. ఈ విధంగా ఉలవలు మెదడు కణాలను, నరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉలవలను మొలకెత్తించి తీసుకోవచ్చు. అలాగే ఉడికించి గుగ్గిళ్లులుగా చేసుకుని తినవచ్చు. అలాగే ఉలవలతో చారును తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా ఉలవలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.