వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం వల్లే కాక ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మరి రోగ నిరోధక శక్తిని పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. దానిమ్మ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యకరమైన లాభాలను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. టైప్ 2 డయాబెటిస్, హైబీపీ సమస్యలను తగ్గిస్తాయి.
2. మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియా వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తక్కువ కొవ్వు ఉండే పెరుగును తీసుకోడం వల్ల మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతోపాటు పోషకాలు కూడా లభిస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
3. పుచ్చకాయలు ఎంతో రుచికరంగా ఉంటాయి. తాజాదనాన్ని అందిస్తాయి. ఈ పండ్లలో 92 శాతం నీరు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను రక్షిస్తాయి. పుచ్చకాయల్లో విటమిన్లు ఎ, బి, సి, లైకోపీన్ ఉంటాయి. ఇవి అతినీలలోహిత కిరణాల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
4. పాలకూర మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
5. నారింజ పండ్లలో విటమిన్ సి, ఇతర పోషకాలు ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం ఐరన్‌ను సరిగ్గా శోషించుకునేలా చేస్తాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. కణాలు దెబ్బ తినకుండా ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
6. ఈ సీజన్‌లో సహజంగానే చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు బీట్‌రూట్‌ను తీసుకోవాలి. ఇది జీర్ణక్రియలను మెరుగు పరుస్తుంది. దీంతో అజీర్ణం తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. చర్మం, వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365