Oats For High BP : షుగర్ వ్యాధి గ్రస్తులకు ఓట్స్ ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. కేవలం షుగర్ వ్యాధి గ్రస్తులే కాకుండా రక్తపోటుతో బాధపడే వారు కూడా ఈ ఓట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ ను పాలతో, నీళ్లతో, ఉప్మా లా, అన్నంలా ఇలా ఏ విధంగా వండుకుని తిన్నా కూడా రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఓట్స్ లో ఎవినాంత్రోమైట్స్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది లోపలికి వెళ్లిన తరువాత రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సెడ్ గా మారుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలకు అందండం వల్ల రక్తనాళాలు శాంతించబడతాయి.
రక్తపోటుతో బాధపడే వారిలో రక్తనాళాలు ఒత్తిడికి గురి అయ్యి పట్టేసినట్టు, ముడుచుకుపోయినట్టు ఉంటాయి. రక్తనాళాలకు నైట్రిక్ యాసిడ్ అందడం వల్ల ముడుచుకుపోయినట్టు ఉండే రక్తనాళాలు ఫ్రీగా తయారవుతాయి. దీంతో రక్తనాళాల్లో రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. ఈ విధంగా రక్తనాళాలు వ్యాకోచించి రక్తసరఫరా సాఫీగా సాగేలా చేయడంలో ఓట్స్ లో ఉండే ఎవినాంత్రోమైట్స్ అనే ఈ రసాయన సమ్మేళనం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తనాళాలు ముడుచుకుపోయినట్టు ఉండడం వల్ల రక్త నాళాల్లో ఉండే కణాల్లో ఇన్ ప్లామేషన్ వస్తుంది. ఈ ఇన్ ప్లామేషన్ ను తగ్గించి రక్తనాళాలను అలాగే వాటి లోపల ఉండే పొరను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ రసాయన సమ్మేళనం మనకు దోహదపడుతుంది.
రక్తనాళాల్లో ఉండే లోపలి పొర ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉండడంతో పాటు రక్తం వేగంగా సాఫీగా ప్రసరణ అవుతుంది. ఈవిధంగా ఓట్స్ రక్తపోటుతో బాధపడే వారికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు, అధిక రక్తపోటుతో బాధపడే వారు ఏదో ఒక రూపంలో ఓట్స్ ను తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.