Peanuts With Jaggery : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం అనేక ఆరోగ్య సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఉదయం త్వరగా నిద్రలేవాలి. వ్యాయామం చేయాలి. వేళకు భోజనం చేయాలి. తగినంత నీటిని తాగాలి. రాత్రి త్వరగా నిద్రించాలి. అలాగే వీటన్నింటితోపాటు పోషకాలు కలిగి ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే పోషకాలు కలిగిన ఆహారాల్లో పల్లీలు, బెల్లం కూడా ఉన్నాయి. సాధారణంగా వీటిని మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. పల్లీలను చట్నీలలో, కూరల్లో వేస్తాం. అలాగే బెల్లంతో స్వీట్లను తయారు చేస్తాం. కానీ రోజూ వీటిని నేరుగానే తినాలి. రోజూ ఒక గుప్పెడు పల్లీలను తిని తరువాత చిన్నం బెల్లం ముక్కను తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం అనంతరం తినాలి. ఇలా తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలు, బెల్లం కలిపి రోజూ తినడం వల్ల శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మహిళలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతుంటారు. కనుక వారు రోజూ ఇలా పల్లీలు, బెల్లం తింటే మంచిది. దీంతో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత ఉండదు. ఇక ఈ రెండింటినీ తినడం వల్ల రక్తం శుద్ధి కూడా అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు, రక్త సంబంధ వ్యాధులు రావు. రక్తం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతోపాటు రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీనివల్ల బీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఇక ఈ మిశ్రమాన్ని రోజూ తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం నుంచి.. ఇతర రోగాల నుంచి బయట పడవచ్చు. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వైరల్, బాక్టీరియల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా ఉంటుంది.
ఇక ఈ మిశ్రమాన్ని రోజూ పిల్లలకు ఇవ్వడం వల్ల వారు ఉత్సాహంగా ఉంటారు. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తారు. పెద్దలు తింటే రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. ఎల్లప్పుడూ నీరసంగా, అలసటగా ఉందని భావించేవారు.. ఉదయాన్నే పల్లీలు, బెల్లం మిశ్రమాన్ని తినాలి. దీంతో శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. మెదడు కూడా ఉత్తేజంగా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇలా పల్లీలు, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక రోజూ మరిచిపోకుండా ఈ మిశ్రమాన్ని తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.