Soaked Black Chickpeas : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో నల్ల శనగలు కూడా ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. నల్ల శనగలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో కూరలు, గుగ్గిళ్లు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే కొందరు ఈ శనగలను మొలకెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు. నల్ల శనగలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల శనగల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల శనగలను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ శనగలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే నల్ల శనగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు వీటిని ఇవ్వడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలకు శనగలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. శనగలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరం ధృడంగా, బలంగా తయారవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శనగలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
దీనిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. బరువు తగ్గడంలో కూడా ఈ శనగలు మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ శనగలను రోజూ ముప్పావు కప్పు మోతాదులో తీసుకోవాలి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఉడికించి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.