Hair Loss : ఈరోజుల్లో చాలామందికి జుట్టు విపరీతంగా రాలుతోంది. జుట్టు రాలిపోవడం నిజానికి పెద్ద సమస్యగా మారింది. జుట్టు రాలిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల చిట్కాలని పాటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జుట్టు రాలిపోకుండా ఉండడానికి కూడా చాలా మంది జాగ్రత్తలు పడుతున్నారు. ఒకసారి జుట్టు రాలడం మొదలుపెట్టిందంటే ఇక రాలిపోతూనే ఉంటుంది. బట్టతల వచ్చేస్తుందని కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు.
అందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. పెద్దగా ప్రయోజనం ఉండదు సరి కదా ఎక్కువ డబ్బులు వృధా అవుతాయి. అయితే ఈ గింజలు కనుక ఉడకబెట్టి తీసుకున్నట్లయితే, ఊడిన జుట్టు మళ్ళీ వచ్చేస్తుంది. జుట్టు రాలడం వంటి బాధలు కూడా ఉండవు. మరి జుట్టు రాలిపోకుండా ఉండాలంటే, ఏం చేయాలి..? ఏ గింజలను తీసుకుంటే, జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది అనే విషయాలని ఇప్పుడు చూసేద్దాం.
చుండ్రులతో బాధపడే వాళ్ళకి జుట్టు బాగా రాలిపోతుందని గమనించాలి. ప్రోటీన్ లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కూడా జుట్టు బాగా రాలిపోతుంది. ఒత్తిడి కూడా ఒక కారణమని చెప్పొచ్చు. సోయాబీన్స్ ని తీసుకుంటే, ఆరోగ్యానికి చాలా చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది సోయాబీన్స్ ఆరోగ్యానికి మేలు చేయవని చెప్తూ ఉంటారు. కానీ వాటి వల్ల మనకు మేలే జరుగుతుంది. సోయాబీన్స్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కలుగుతాయి.
సోయా గింజల్ని మీరు నానబెట్టేసి, ఉడకపెట్టుకుని తీసుకుంటే మంచిది. అలానే మొలకల్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మొలకలను తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఊడిన జుట్టు కూడా మళ్లీ వస్తుంది. గింజల్లో ఉన్న ప్రోటీన్ కంటే మొలకల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొలకలను తీసుకుంటూ ఉండండి. ప్రోటీన్ తో పాటుగా ఇతర పోషక పదార్థాలు కూడా మీకు లభిస్తాయి. ఇలా, మీరు కనుక వీటిని తీసుకున్నట్లయితే, మళ్లీ జుట్టు వస్తుంది. జుట్టు రాలడం వంటి సమస్యలు ఉండవు కాబట్టి వీటిని గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వండి.