How To Remove Blood Clots : చాలా సందర్భాలలో రక్తం గడ్డ కట్టడం మంచిదే. కొన్ని సందర్భాలలో రక్తం గడ్డకట్టకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాల వలన గుండె హార్ట్ బీట్ అంటే గుండె కొట్టుకోవడం ఒకసారి తక్కువగా, ఇంకోసారి ఎక్కువగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. క్షణాల్లోనే గుండెపోటుతో చనిపోతున్నారు. ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ వంటి సమస్యలతో, చాలామంది సడన్ గా చనిపోతున్నారు. అయితే, గుండె సమస్యలకి కారణం పోస్ట్ కోవిడ్ లక్షణాలని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.
ఒత్తిడి, గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, అధిక బరువు, షుగర్, నిద్రలేమి ఇటువంటివి కూడా గుండెపోటుకి కారణం అవ్వచ్చు. పైగా శరీరంలో కొన్ని చోట్ల రక్తనాళాలలో క్లాట్స్ ఏర్పడడం వలన కూడా, హార్ట్ ఎటాక్ లు రావచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే, పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలని నమిలి తింటే మంచిది. నేరుగా తినలేకపోతే, తేనెలో వేసి తీసుకోవచ్చు. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
అలానే రక్తపు గడ్డలు లేకుండా ఇది చూస్తుంది. హైబీపీ కూడా వెల్లుల్లితో తగ్గుతుంది. రోజు ఒక కప్పు నల్ల ద్రాక్షని తింటే కూడా ఈ సమస్య ఉండదు. ఒక గ్లాసు ద్రాక్ష జ్యూస్ ని తాగడం కూడా అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే కూడా, క్లాట్స్ కరిగిపోతాయి. రోజు ఒక 60 మిల్లీలీటర్ల రెడ్ వైన్ తాగితే కూడా క్లాట్స్ కరిగిపోతాయి. ఇది అసలు ఆల్కహాల్ కాదని గుర్తుపెట్టుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి.
కొంచెం ధర ఎక్కువైనా సరే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు రాత్రి పూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో, కొద్దిగా పసుపు వేసుకుని తీసుకుంటే కూడా రక్తనాళాలలో ఏర్పడిన క్లాట్స్ కరిగిపోతాయి. రెండు పూట్ల భోజనానికి ముందు, ఒక స్పూన్ అల్లం రసం తీసుకుంటే, రక్తనాళాల వాపులు తగ్గుతాయి. రక్తనాళాలలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కివి, పైనాపిల్ పండ్ల తో పాటుగా పాలకూర కూడా తీసుకుంటూ ఉండండి. ఇవన్నీ కూడా క్లాట్స్ ని కరిగించడానికి సహాయం చేస్తాయి.