Weight Loss Tips : సాధారణంగా అధికంగా శరీర బరువు పెరిగిన వారు వివిధ రకాల వ్యాధుల బారిన పడటం మనం చూస్తుంటాం.ఈ క్రమంలోనే అధిక శరీర బరువు పెరిగిన వారు తమ శరీర బరువును తగ్గించుకోవడం కోసం వివిధ రకాల వ్యాయామాలను చేస్తుంటారు.
ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్ చేస్తూ తమ శరీర బరువు తగ్గించుకోవటానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రతిరోజూ ఇలా కష్టపడుతున్నప్పటికీ కొందరిలో ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు. అందుకు అనేక కారణాలు ఉంటాయి.
మెడికల్ సైన్స్ నివేదిక ప్రకారం.. అధిక బరువు పెరిగిన వారు ప్రతి రోజూ వివిధ రకాల క్రీడలలో పాల్గొనడం వల్ల త్వరగా బరువు తగ్గడమే కాకుండా వారి శరీరం ఎంతో ఫిట్ గా ఉంటుందని వెల్లడైంది. ఈ క్రమంలోనే మన శరీర బరువు తగ్గడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయని తెలియజేశారు.
సాధారణంగా బరువును తగ్గించుకోవడం కోసం ప్రతి రోజూ రన్నింగ్ చేస్తుంటారు. అయితే రన్నింగ్ చేయడం వల్ల బరువు తగ్గినప్పటికీ చాలా ఆలస్యంగా బరువు తగ్గుతారు. కానీ త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ముందుకు కాకుండా వెనక్కి పరిగెత్తడం వల్ల త్వరగా బరువును తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ కేవలం ఐదు నిమిషాల పాటు వెనక్కి పరిగెత్తడం వల్ల మన శరీరంలో 20 శాతం కేలరీలు అధికంగా కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో త్వరగా బరువును తగ్గించుకోవచ్చు.