ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ఆచరిస్తుంది. అందులో ప్రపంచ వ్యాప్త డయాబెటీస్ రోగులకవసరమైన సూచనలిస్తుంది. ప్రధానంగా డయాబెటీస్ వ్యాధి ఒక జీవ ప్రక్రియలోని అసమతుల్యతగా చెప్పాలి. డయాబెటీస్ తో ఇంకా అనేక ఇతర వ్యాధులు అంటే, గుండె ఆరోగ్యం, కిడ్నీల ఆరోగ్యం వంటివి కూడా ముడిపెట్టవచ్చు. అయితే, డయాబెటీస్ కు గుండె వ్యాధికి సంబంధం వుందా? అనేది పరిశీలించండి.
మనం తినే ఆహారం రక్తంలో గ్లూకోజ్ గా మారుతుంది. దీనినే షుగర్ గా కూడా వ్యవహరిస్తారు. పొట్ట వెనుక భాగంలో వుండే పాన్ క్రియాస్ గ్రంధి కనుక అది ఉత్పత్తి చేయాల్సిన ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంతగా ఉత్పత్తి చేయకుంటే, కండరాలు, లివర్ లలోని కొవ్వు కణాలు ఆ ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించకుండా వుంటే ఆ గ్లూకోజ్ రక్తంలోనే నిలబడిపోతుంది.
శరీరానికి తగినంత శక్తి దొరకదు. డయాబెటీస్ కనుక నియంత్రించకపోతే, ఆ వ్యాధి నరాలకు, కళ్ళకు, కిడ్నీలకు, గుండెకు రక్తాన్ని చేరవేసే రక్త నాళాలకు వ్యాపించి గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోటు వంటివి కలిగేలా చేస్తుంది.