Bitter Gourd Tea : మనకు అందుబాటులో ఉండే వివిధ రకాల కూరగాయల్లో కాకరకాయలు ఒకటి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటితో అనేక లాభాలను పొందవచ్చు. కాకరకాయలను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటి రసాన్ని కూడా కొందరు తాగుతుంటారు. అయితే కాకరకాయలతో టీని తయారు చేసుకుని కనీసం రోజుకు ఒక కప్పు తాగడం వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలి.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయలను ముక్కలుగా కోసి ఎండబెట్టాలి. ఈ ముక్కలను గాలి తగలని సీసాలో నిల్వ చేయాలి. వాటిలోంచి రెండు ముక్కలను తీసి కప్పున్నర నీళ్లలో వేసి మరిగించాలి. నీళ్లు ఒక కప్పు అయ్యే వరకు మరిగించిన తరువాత వచ్చే మిశ్రమాన్ని వడకట్టాలి. అనంతరం అందులో కాస్త తేనె, నిమ్మరసంలను రుచి కోసం కలపాలి. దీంతో కాకరకాయ టీ తయారవుతుంది. దీన్ని రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
కాకరకాయ టీని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ టీ మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం వంటివి ఉండవు. దీంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. లివర్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఈ విధంగా కాకరకాయ టీతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.