Eggs : చలికాలం మొదలవడంతో పూర్తిగా మన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. చలికాలం రావడం వల్ల చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. కనుక ముందుగా మన ఆహారం విషయంలో ఎన్నో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది చలికాలంలో ఆకలి వేయడం లేదు అనే సమాధానం ఇస్తుంటారు. ఇలాంటి వారు ఆకలి కలగడం కోసం రోజువారీ ఆహారంలో భాగంగా గుడ్డును తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా గుడ్డును ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఉడకబెట్టిన గుడ్డును తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వివిధ రకాల రెసిపిలను తయారు చేసుకొని గుడ్లను తినవచ్చు. ఈ క్రమంలోనే ఉడికించిన కోడి గుడ్డు కాకుండా ఆమ్లెట్ వేసుకొని తినవచ్చు. లేదంటే ఎగ్ చాట్ తయారు చేసుకొని తినవచ్చు. అలాగే ఎగ్ బోండా, ఎగ్ దోశ, ఎగ్ పకోడీలను వేసుకుని తినవచ్చు.
ఎగ్ చాట్ : ఎగ్ చాట్ తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఉడికించిన కోడి గుడ్డుపై పెంకు తీసి అందులోకి ఉప్పు, కారం, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, కొత్తిమీర తరుగు కలుపుకుంటే.. ఎంతో సులభంగా ఎగ్ చాట్ తయారవుతుంది. దీన్ని రుచిగా తినేయవచ్చు.
ఎగ్ దోశ : ముందుగా దోశ పెనంపై దోశ వేయాలి. అనంతరం ఆ దోశపై గుడ్డును పగలగొట్టి దోశలా వేయాలి. ఆపై ఉప్పు, కారం వేయాలి. ఇంకా ఇష్టపడేవారు చీజ్ వంటి వాటిని వేసుకొని తినవచ్చు.
ఎగ్ కబాబ్ : ఉడికిన గుడ్లతో ఎగ్ కబాబ్ ను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా గుడ్లను ఉడకబెట్టి పెంకు తీసుకోవాలి. అనంతరం శనగపిండిలో కొద్దిగా ఉప్పు, కారం కలుపుకుని ఉడికిన కోడిగుడ్లను శనగపిండిలో కలిపి కాగిన నూనెలో వేసి ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. దీంతో రుచిగా వాటిని తినవచ్చు.
ఎగ్ పరాటా : చాలా మంది అల్పాహారంగా పరాటాలు తింటారు. అయితే ఆ పరాటాలోకి టమోటో ముక్కలు, ఉల్లిపాయ, ఉడికించిన గుడ్లతో కలిపి తయారు చేసుకుంటే తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యం కూడా లభిస్తుంది.