Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం & ఫిట్‌నెస్

Heart Health : గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 ఆయుర్వేద మూలికలను వాడండి..!

Editor by Editor
October 8, 2021
in ఆరోగ్యం & ఫిట్‌నెస్, మూలిక‌లు
Share on FacebookShare on Twitter

Heart Health : గుండె మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తూ రక్తాన్ని పంపుతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి గుండె సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహారం, మూలికలు, వ్యాయామం, ధ్యానం వంటివి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Heart Health take these 5 ayurvedic herbs

1.  గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో అర్జున బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బెరడు పొడి గుండెకు మేలు చేస్తుంది. ఇది హార్ట్ టానిక్‌గా పనిచేస్తుంది, గుండె కండరాలను బలపరుస్తుంది. ఇది అధిక రక్తపోటు స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల అర్జున బెరడు పొడిని రోజూ ఉదయం, సాయంత్రం అర టీస్పూన్‌ మోతాదులో తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

2. అమలకి. దీన్నే ఉసిరి అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌, అనాల్జెసిక్‌, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్‌ లక్షణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కాలేయం, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ అల్సర్‌, షుగర్‌ వంటి అనేక వ్యాధులకు ఉసిరిక పొడిని ఉపయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ఉసిరిక పొడిని రోజూ తీసుకోవాలి. దీన్ని కూడా తేనెతో తీసుకోవచ్చు.

3. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే మరో మూలిక మునగాకు. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. మునగ ఆకులు, కాయలు, పువ్వులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మునగాకుల రసాన్ని రోజూ ఉదయం పరగడుపున 30 ఎంఎల్‌ మోతాదులో తాగుతుండాలి. మునగాకుల కూర కూడా తినవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

4. అవిసె గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు ఉన్నవారికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల అవిసె గింజలను రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

5. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కర్కుమిన్ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ మూలికలు నేరుగా మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల వీటిని తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Tags: ayurvedic herbsheart healthఆయుర్వేద మూలిక‌లుగుండె ఆరోగ్యం
Previous Post

Banana : ప్రతి రోజూ ఈ సమయంలో ఒక అరటి పండును తినండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

Next Post

BP : హైబీపీ ఉందా ? అయితే ఈ సూచనలను రోజూ పాటించండి.. బీపీ కచ్చితంగా అదుపులోకి వస్తుంది..!

Related Posts

మూలిక‌లు

ఏయే వ్యాధులను న‌యం చేసేందుకు తుల‌సి ఆకుల‌ను ఎలా వాడాలో తెలుసా..?

March 16, 2025
మూలిక‌లు

ఏయే ఆకులు ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

March 14, 2025
మూలిక‌లు

క‌ర‌క్కాయ‌ల‌తో అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కాలు.. ఏయే వ్యాధులు త‌గ్గేందుకు దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

February 9, 2025
మూలిక‌లు

పిచ్చి పిచ్చి ఆలోచనలకు వట్టివేర్లతో చెక్ పెట్టొచ్చు!

January 18, 2025
మూలిక‌లు

కింగ్ ఆఫ్ ఆయుర్వేద.. అశ్వగంధ..!

January 3, 2025
మూలిక‌లు

Ashwagandha Benefits : రోజూ ఒక స్పూన్ చాలు.. పురుషుల్లో ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

December 18, 2024

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!