ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 69 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అధిక బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అధికంగా బరువు ఉన్నవారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. దీంతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
1. ఉదయం పరగడుపునే పావు గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు.
2. తిప్పతీగ రసం అర టీస్పూన్, త్రిఫల చూర్ణం పావు టీస్పూన్, తేనె టీస్పూన్ కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి.
3. పావు గ్లాస్ గోరు వెచ్చని నీళ్లలో ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు.
4. నిత్యం ఒక గ్లాస్ ఆవు పాలలో చక్కెర కలపకుండా తాగుతుండాలి. సన్నగా మారుతారు.
5. రోజూ రెండు పూటలా అన్నంలో మొదటి ముద్దను శొంఠి పొడి వేసి కలిపి తింటే కొవ్వు కరుగుతుంది.
6. కరక్కాయ చూర్ణం, ఉసిరిక చూర్ణం, పిప్పళ్ల చూర్ణం సమభాగాల్లో తీసుకుని కలిపి దాన్ని రోజుకు ఒక టీస్పూన్ చొప్పున కప్పు వేడి నీళ్లలో కలిపి తీసుకోవాలి. అధిక బరువు తగ్గుతారు.
7. అధిక బరువు ఉన్నవారు మధ్యాహ్నం నిద్ర పోరాదు. అలాగే రాత్రి త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రించాలి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఈ చిట్కాలు, సూచనలు పాటించడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు.