Beauty Tips : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. కొందరికి దురదలు వస్తుంటాయి. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాగే కొందరికి మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. అంద విహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని మామూలుగా చేసుకోవాలని చూస్తుంటారు. అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా మెడ భాగంలో ఉండే నలుపు పోదు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల మెడ భాగంలో ఉండే నలుపు పోతుంది. దీంతోపాటు ఆ భాగంలో చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టీస్పూన్ పెరుగులో 4-5 నిమ్మరసం చుక్కలు కలిపి మిశ్రమంగా చేయండి. దీన్ని మెడ భాగంలో రాయాలి. 15 నిమిషాల పాటు ఉంచిన తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కచ్చితంగా వారం రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
నిమ్మరసం, పాల మిశ్రమాన్ని మెడపై రాయాలి. పదిహేను నిమిషాల తరువాత సున్నిపిండి అప్లై చేయాలి. మళ్లీ 15 నిమిషాలు ఆగాలి. ఆ తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తున్నా మెడ భాగంలో ఉండే నలుపు పోతుంది.
కాస్తంత పెరుగులో కొద్దిగా బియ్యం పిండిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని మెడ భాగంలో రాయాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మెడ భాగం అందంగా మారుతుంది.