Cholesterol : ప్రస్తుత తరుణంలో హార్ట్ ఎటాక్ ల కారణంగా మరణించే వారు అధికమవుతున్నారు. హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తసరఫరాకు ఆటంకం కలగడం వల్ల హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది. ఒక్కోసారి ఈ హార్ట్ ఎటాక్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ దీని బారిన పడిన తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలి. మందులను తగిన సమయంలో వేసుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటిని పాటిస్తూనే మన ఇంట్లో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మరలా హార్ట్ ఎటాక్ మన దరి చేరకుండా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉన్న వారు దీనిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాం.
హార్ట్ ఎటాక్ ను నివారించే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..ఈ పానీయాన్నిఎంత మోతాదులో ఎలా తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం 2 గ్లాసుల మంచినీటిని, 2 ఇంచుల అల్లం ముక్కను, 10 వెల్లుల్లి రెబ్బలను, ఒక నిమ్మకాయను, దాల్చిన చెక్క పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. అల్లాన్ని శుభ్రపరిచి ముక్కలుగా చేయాలి. అలాగే నిమ్మకాయను కూడా కడిగి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలను, నిమ్మకాయ ముక్కలను, అల్లం ముక్కలను వేసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించాలి. రెండు గ్లాసుల నీటిని ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి.

తరువాత నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిని మనం పది రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె సమస్యలను నయం చేసే అనేక రకాల మందుల్లో నిమ్మరసాన్ని, వెల్లుల్లిని, అల్లాన్ని విరివిరిగా ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ పదార్థాలతో తయారు చేసిన పానీయాన్ని తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని 50 ఎమ్ ఎల్ మోతాదులో పరగడుపున తీసుకోవాలి. దీనిలో రుచి కొరకు తేనెను కూడా కలుపుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని 3 వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వారం రోజుల పాటు ఆగి మరలా 3 వారాల పాటు దీనిని తీసుకోవచ్చు. ఇలా ఆరు నెలలకు ఒకసారి ఈ పానీయాన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. రక్తసరఫరా కూడా సాఫీగా సాగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ పానీయాన్ని తీసుకోవడం మనం చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.