డయాబెటిస్ కారణంగా ప్రస్తుతం చాలా మంది ఇబ్బందులను పడుతున్నారు. వంశ పారంపర్యంగా కొందరికి టైప్ 1 డయాబెటిస్ వస్తుంటే.. కొందరికి అస్తవ్యస్తమైన జీవన విధానం కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అయితే డయాబెటిస్ వచ్చిన వారు డాక్టర్లు సూచించిన విధంగా మందులను వాడడంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
అయితే కొందరికి షుగర్ లెవల్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి ఎక్కువగా ఉండడం, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అలాంటి వారు ఉసిరి, తేనె లను కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
ఉసిరికాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో అధికంగా వాడుతారు. అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉసిరిక పొడి, రసం అనేక వ్యాధులను నయం చేస్తాయి. డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నవారికి ఉసిరి ఒక వరమనే చెప్పవచ్చు. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో.. వ్యాధులు రాకుండా చూడడంలో తేనె కూడా బాగానే పనిచేస్తుంది. తేనెలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
అయితే ఉసిరికాయ రసం 30 ఎంఎల్, తేనె 2 టీస్పూన్లు కలిపి ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటూ ఉంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతోపాటు ఇతర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.