Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Toenail Fungus : ఫంగస్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పాదాల్లో ఇబ్బందిగా ఉందా.. ఈ చిట్కాలను పాటించండి..!

Admin by Admin
January 5, 2022
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Toenail Fungus : పాదాలపై కొందరికి సహజంగానే ఫంగస్‌ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల పసుపు లేదా బూడిద రంగులోకి కాళ్ల వేళ్లు మారుతుంటాయి. ఈ సందర్భంలో కొందరికి నొప్పి, దురద, మంట ఉంటాయి. దీన్నే నెయిల్‌ ఫంగస్‌ లేదా ఆనికోమైకోసిస్‌ అంటారు. ఇది అత్యంత సహజసిద్ధంగా వచ్చే సమస్య. కొందరికి పాదాల్లో తేమ వల్ల బాక్టీరియా వృద్ధి చెంది ఇలా జరుగుతుంటుంది. అయితే ఈ సమస్యను సులభంగానే తగ్గించుకోవచ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

natural home remedies for Toenail Fungus

1. ఒక బకెట్‌లో సగం వరకు గోరు వెచ్చని నీళ్లను తీసుకోవాలి. అందులో రెండు టీస్పూన్ల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసి కలపాలి. అనంతరం ఆ నీటిలో పాదాలను ముంచి 30 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పాదాలను తీసేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయాలి. దీంతో పాదాలపై ఉండే ఫంగస్‌ తగ్గిపోతుంది. పాదాలు మళ్లీ పూర్వ రూపాన్ని పొందుతాయి.

2. ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని బాగా నలిపి నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిని బకెట్‌ వేడి నీటిలో కలపాలి. ఆ నీటిలో పాదాలను ముంచి 30 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పాదాలను తీసి కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయాలి. వెల్లుల్లిలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల పాదాలపై ఏర్పడే ఫంగస్‌, బాక్టీరియా పోతాయి.

3. రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని నలిపి అందులో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న వేలిపై రాయాలి. తరువాత గంట సేపు అలాగే ఉంచి అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేయవచ్చు. దీంతో పాదాలపై ఉండే ఫంగస్‌, క్రిములు పోయి సమస్య తగ్గుతుంది.

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

4. మూడు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె, అంతే మోతాదులో పసుపు తీసుకుని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని పాదాలపై సమస్య ఉన్న వేళ్లకు బాగా రాయాలి. గంట సేపు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. పాదాలను పొడిగా అయ్యేలా ఆరబెట్టాలి. ఇలా రోజూ చేస్తే పాదాల ఫంగస్‌ తగ్గిపోతుంది.

5. పాదాలపై ఉండే ఫంగస్‌ను తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్‌ కూడా బాగానే పనిచేస్తుంది. కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ ను నేరుగా వేళ్లపై అప్లై చేయవచ్చు. లేదా బకెట్‌ వేడి నీటిలో ఈ ఆయిల్‌ను కొన్ని చుక్కలు వేసి అనంతరం ఆ బకెట్‌లో పాదాలను ఉంచి 30 నిమిషాల తరువాత తీసి కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

6. పాదాల ఫంగస్‌ను తొలగించడంలో విక్స్‌ కూడా బాగానే పనిచేస్తుంది. రాత్రి పూట పాదాలకు సమస్య ఉన్న చోట కొద్దిగా విక్స్‌ రాయాలి. అనంతరం సాక్స్‌లను ధరించాలి. మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో మూడు, నాలుగు రోజుల్లోనే సమస్య నుంచి బయట పడవచ్చు.

Can people with gas problems drink lemon juice

7. బేకింగ్‌ సోడా, నిమ్మరసంలను కొద్దిగా తీసుకుని కలిపి సమస్య ఉన్న చోట రాసి గంట సేపయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంంటుంది.

Tags: Toenail Fungusపాదాల‌పై ఫంగ‌స్‌
Previous Post

Health Tips : ఆయుర్వేద ప్ర‌కారం పాలు, పెరుగు, నెయ్యిల‌ను రోజులో ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..?

Next Post

Omega 3 Fatty Acids : 30 రోజుల పాటు వీటిని తీసుకోండి.. షుగర్‌, కొలెస్ట్రాల్‌, అధిక బరువు, కంటి చూపు.. లాంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!