Turmeric For Teeth : ఒక చక్కటి చిట్కాను వాడి మనం మన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చని మీకు తెలుసా.. ఈ చిట్కాను వాడడం వల్ల చాలా సులభంగా పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. మనలో చాలా మందికి దంతాలు పసుపు రంగులో ఉంటాయి. దీని వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దంతాలు పసుపు రంగులో మారడానికి అనేక కారణాలు ఉంటాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, కెఫిన్ ఉండే పదార్థాలను తీసుకోవడం, పొగాకు ఉత్పుత్తులను వాడడం వంటి వివిధ కారణాల చేత దంతాలు పసుపు రంగులో మారిపోతాయి. దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల నలుగురితో చక్కగా మాట్లాడలేకపోతుంటారు.
ఆత్మనూన్యత భావనకు గురి అవుతూ ఉంటారు. ఒక చక్కటి చిట్కాను మన ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల మనం మన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. బేకింగ్ సోడాను వాడకుండా దంతాలపై ఉండే పసుపుదనాన్ని తొలగించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో మన దంతాలకు సరిపడా టూత్ పేస్ట్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. తరువాత 7 లేదా 8 చుక్కల నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న టూత్ పేస్ట్ ను బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకొకసారి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల నోట్లో ఉండే క్రిములు నశిస్తాయి. నోటి దుర్వాసన తగ్గి నోరు తాజాగా ఉంటుంది. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎటువంటి సమస్య లేని వారు కూడా ఈ చిట్కాను వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. ఈ చిట్కాను పాటిస్తూనే దంతాలు పసుపు రంగులో ఉన్న వారు టీ, కాఫీలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.