Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

ఒకే ఒక్కడు ఒంటి చేత్తో 48 మంది పాక్ సైనికులను మట్టుబెట్టిన మొనగాడు..!

Admin by Admin
May 27, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

1999 మే 5 న అయిదుగురు భారత సైనికులను బంధించి, వారిని చిత్ర హింసలు పెట్టి చంపారు పాక్ సైనికులు..అక్కడి నుండి మొదలైన పోరాటం. చివరకు కార్గిల్ వార్ తో ముగిసింది. ఈ వార్ లో ఇండియా విజయం సాధించింది. అయితే ఈ వార్ గురించి చెప్పుకున్నప్పుడల్లా…ఓ మహావీరుడిని, గుండె నిబ్బరం దండిగా ఉన్న ధీశాలిని , భారతమాత కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అసలు సిసలు భారత సైనికుడిని స్మరించి తీరాల్సిందే.. ఆ వీర సైనికుడి పేరు డిజేంద్ర కుమార్. రాజస్థాన్ లోని జాలారా గ్రామంలో పుట్టిన డిజేంద్ర… దేశ సేవ చేయాలని యవ్వన ప్రాయం నుండే ఉవ్విళ్లూరేవాడు. అదే లక్ష్యంతో ఇండియన్ ఆర్మీలో చేరాడు. ఆరు అడుగలకు పైగా ఎత్తున్న మనిషి, ఉక్కులా ఉండే దేహం… అన్నింటికి మించి దేశం కోసమే నా ఈ జీవితం అనే తెగువ… అతడి బ్యాచ్ మేట్స్ అందరూ అతడిని ముద్దుగా కోబ్రా అని పిలుచుకునే వారు. ఇతను రాజ పుతానా అనే బెటాలియన్ కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇతని సారథ్యంలోని రాజపుతానా బెటాలియన్ శ్రీనగర్ లో ఓ ఆపరేషన్ పనిలో బిజీగా ఉంది.

ఇది ఇలా ఉండగా….. మే 15 నుండి కాశ్మీర్ ప్రాంతమంతా బాంబులతో దద్దరిల్లుతుంది. పాక్ సేన దాడులతో విరుచుకుపడుతుంది. భారత సైన్యం కూడా దానికి ధీటుగానే సమాధానం చెబుతుంది. రోజులు గడుస్తున్నా కొద్ది పాక్ బలగాలు తన స్ట్రాటజీ ని మార్చుకుంటూ ముందుకు కదులుతున్నాయి జూన్ 11 నాటికి మొత్తం 11 బాంబింగ్ ట్యాంకర్ల సహాయంతో 15000 అడుగుల ఎత్తులో ఉన్న ద్రాస్ సెక్టారులోని 4590 పాయింటును స్వాదీనం చేసుకున్నాయి. భారత సైనిక అధికారులందరూ టెన్ష‌న్ లో ఉన్నారు. ద్రాస్ సెక్టార్ ప్రాంతం పాక్ సైనిక చేతుల్లోకి వెళ్లిపోయిందనే టెన్ష‌న్ ప్రతి ఒక్కరి ముఖంలో కనిపిస్తుంది. ఇక లాభం లేదనుకున్న ఇండియన్ అధికారులు అన్ని అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నారు. ఇంతలోనే శ్రీనగర్ లో ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చిన డిజేంద్రకు ద్రాస్ సెక్టార్ ను తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పజెప్పారు.

kargil digendra kumar do you know about him

తన రాజ్ పుతానా బెటాలియన్ తో అటువైపుగా పయనం స్టార్ట్ చేశాడు డిజేంద్ర….ముందుగా అక్కడున్న 11 బంకర్లలో మొదటి దానిని, చివరి దానిని తాను పేల్చేస్తానని, మిగితా వాటి పని మీరు పట్టండని తన సహచరులకు ఆదేశాలు జారీ చేసి..అనుకున్నట్టుగానే 1వ,11 వ పాక్ బంకర్లను పేల్చేశాడు డిజేంద్ర…. మిగితా బంకర్ల టార్గెట్ వీరి వైపుకు మళ్లింది…అటు నుండి బాంబులు శరవేగంగా దూసుకు వస్తున్నాయ్.ఈ బెటాలియన్ లోని అయిదుగురు సైనికులు అవతలి వారికి చిక్కారు…..ఈ క్రమంలో శత్రువుల చేతిలో చావడం కంటే ఆత్మహత్యే శరణ్యమని భావించిన వారు.. వారికి వారే పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్చేసుకున్నారు.

ఇదంతా గమనిస్తున్న కోబ్రా….ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ లైట్ మెషిన్ గన్ ను తీసుకొని పాక్ బంకర్లే టార్గెట్ గా అటువైపుకు దూసుకుపోతున్నాడు. అంతలోనే ఓ బుల్లెట్ వచ్చి అతని ఎడమ భుజాన్ని చీల్చుకుంటూ వెళ్లింది అయినా… డిజేంద్ర వెనక్కి తగ్గలేదు. అడుగులో అడుగు వేసుకుంటూ పాక్ బంకర్లనే టార్గెట్ చేసుకుంటూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు 48 మంది పాక్ సైనికులను మట్టుబెట్టాడు. మరో విషయం ఏంటంటే…కొంత మందిదో అయితే గన్ లతో కాకుండా డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి మరీ వారి పని పట్టాడు. ఫైనల్ గా జూన్ 13, 1999 న పాక్ ఆక్రమించిన ద్రాస్ సెక్టారులోని 4590 పాయింటును తిరిగి స్వాధీనం చేసుకొని అక్కడ మన మువ్వన్నెల జెండాను నిలబెట్టి సెల్యూట్ కొట్టి అక్కడే పడిపోయాడు..ఆ పాటికే అతని శరీరంలోకి 18 బుల్లెట్లు చొచ్చుకుపోయాయి.ఇతని అత్యున్నత స్థాయి పొరాటానికి గుర్తుగా అప్పటి వాజపాయ్ ప్రభుత్వం డిజెంద్ర సింగ్ ను ఆగస్ట్ 15, 1993 న మహావీర చక్ర అవార్దుతో గౌరవించింది.

Tags: kargil digendra kumar
Previous Post

ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు, ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం కావాలా..? ఈ ప్లేస్‌ల‌కు టూర్ వేయండి..!

Next Post

కోక‌కోలా…. ఎక్క‌డి నుండి వ‌చ్చింది? దానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది?

Related Posts

వైద్య విజ్ఞానం

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..?

July 17, 2025
Crime News

అత్యాచార నిందితుల‌కు ఏయే దేశాల్లో ఎలాంటి శిక్ష‌లు వేస్తారో తెలుసా..?

July 17, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ ఉద్యోగాల‌ను చేసే వారికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ‌గా ఉంద‌ట‌..!

July 17, 2025
lifestyle

ఈ రాశులు ఉన్న స్త్రీల‌ను పెళ్లి చేసుకుంటే పురుషుల‌కు ఎంతో మంచిద‌ట‌..!

July 17, 2025
ఆధ్యాత్మికం

నరదిష్టి ఉందా..అయితే ఇలా చేస్తే చాలు అంతా మాయం..!!

July 17, 2025
mythology

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామికి మ‌ట్టి కుండ‌లోనే ఎందుకు నైవేద్యం పెడ‌తారు..?

July 17, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.