ఓ రెస్టారెంట్ లో నలుగురు భోజనం చేస్తున్నారు. ఇంతలో అందులోని ఓ మహిళ మీద బొద్దింక పడింది, ఆ బొద్దింకను చూసి ఆ మహిళ చెంగున్న అంతెత్తు లేచి,గయ్య్…. మంటూ అరిచి బొద్దింకను దులిపేసుకుంది. ఇప్పుడు ఆ బొద్దింక ఆ మహిళ పక్కనే ఉన్న మరో వ్యక్తి మీద పడింది…ఆ వ్యక్తి కూడా అలాగే అరిచి బొద్దింకను వదిలించుకున్నాడు. ఇంతలో…ఓ వెయిటర్ వీళ్ళకు సర్వ్ చేయడానికి వచ్చాడు…ఈ సారి బొద్దింక అతని మీద పడింది….దీన్ని చూసిన ఆ వెయిటర్ తన చేతిలోని ఆహార పదార్థాలు టేబుల్ మీద పెట్టి…తన షర్ట్ మీద తిరుగుతున్న ఆ బొద్దింకను ఒద్దికగా చేత పట్టుకొని బయట వదిలేసి వచ్చాడు.
ఇప్పుడు దీన్ని జీవితానికి అన్వయించుకుందాం…
బొద్దింకను ఓ ఇబ్బందిగా, సమస్యగా తీసుకుంటే…. మొదటి మహిళ మరియు వ్యక్తి…ఈ సమస్యకు చాలా భయపడిపోయారు. దానిని ఎలాగైనా తప్పించుకోవాలనుకొని సడెన్ నిర్ణయం తీసుకున్నారు. అదే వెయిటర్…. తనకు బొద్దింక అనే సమస్య ఎదురవ్వగానే…. ఖంగారుపడకుండా…చాలా ప్రశాంతంగా దానిని గమనించి తీసి బయటపడేసి వచ్చాడు ( సమస్య నుండి బయటపడ్డాడు).
మనల్ని ఇబ్బంది పెట్టించే అంశాల పట్ల రియాక్ట్ అవ్వొద్దు , రెస్పాండ్ అవ్వాలి. రియాక్ట్ అనేది అచేతనంగా చేసేది, రెస్పాండ్ అనేది ఆలోచించి చేసేది. కాబట్టి ఓ సమస్యను ఎదుర్కొనే ముందు ఆలోచన ముఖ్యం.
కాక్రోచ్ థియరీ సారాంశం: A beautiful way to understand…………LIFE. Person who is HAPPY is not because Everything is RIGHT in his Life.. He is HAPPY because his Attitude towards Everything in his Life is Right..!!