Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Honey Chilli Cauliflower : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఈ స్నాక్స్ చేసి పెట్టండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..!

Editor by Editor
July 31, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Honey Chilli Cauliflower : సాయంత్రం స‌మ‌యంలో వేడిగా తినేందుకు స్నాక్స్ ఏమున్నాయా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే రెసిపి మీకోస‌మే. ఈ రెసిపిని చేయ‌డం చాలా సుల‌భం. ఇందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. చాలా సుల‌భంగా దీన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇంత‌కీ ఈ రెసిపి ఏంటంటే.. హ‌నీ చిల్లి కాలిఫ్ల‌వ‌ర్‌. అవును, చెప్పిన‌ట్లుగానే ఈ డిష్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓ వైపు తీపి, మరోవైపు కారం రెండూ మ‌న నాలుక‌కు త‌గులుతాయి. అందువ‌ల్ల ఈ డిష్ అంద‌రికీ ఎంత‌గానో న‌చ్చుతుంది. ఇక ఈ వంట‌కాన్ని ఎలా త‌యారు చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హనీ చిల్లీ కాలిఫ్ల‌వ‌ర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీడియం సైజ్ కాలిఫ్ల‌వ‌ర్ – 1 (చిన్న ముక్క‌లుగా త‌ర‌గాలి), మైదా పిండి – 1 క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – అర క‌ప్పు, నీళ్లు – అర క‌ప్పు, బేకింగ్ పౌడ‌ర్ – అర టీస్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – వేయించేందుకు స‌రిప‌డా.

how to make Honey Chilli Cauliflower in telugu recipe is here
Honey Chilli Cauliflower

సాస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వెజిట‌బుల్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బ‌లు – 2, అల్లం – 1 టేబుల్ స్పూన్‌, ప‌చ్చి మిర్చి – 2 లేదా 3, సోయా సాస్ – పావు క‌ప్పు, తేనె – పావు క‌ప్పు, వెనిగ‌ర్ – 1 టేబుల్ స్పూన్‌, చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్‌, ట‌మాటా కెచ‌ప్ – 1 టేబుల్ స్పూన్‌, నువ్వుల నూనె – 1 టేబుల్ స్పూన్‌, 2 టేబుల్ స్పూన్ల నీళ్ల‌తో క‌లిపి కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్‌.

గార్నిష్ కోసం..

నువ్వులు, త‌రిగిన ఉల్లికాడ‌లు, కొత్తిమీర‌.

హ‌నీ చిల్లీ కాలిఫ్ల‌వ‌ర్‌ను త‌యారు చేసే విధానం..

ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్‌, బేకింగ్ పౌడ‌ర్‌, కొద్దిగా ఉప్పు వేసి క‌ల‌పాలి. అందులోనే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు క‌లుపుకోవాలి. చిన్నగా క‌ట్ చేసిన కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను ఆ పిండిలో ముంచి తీయాలి. ముక్క‌ల‌కు పిండి పూర్తిగా అంటుకునేలా చూడాలి. ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి మీడియం-హై మంట‌పై వేడి చేయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి బంగారు గోధుమ రంగులో క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వాటిని టిష్యూ పేప‌ర్‌లోకి తీసుకుని ఎక్కువ‌గా ఉన్న నూనెను పిండేయాలి.

ఒక పెద్ద పాన్ తీసుకుని అందులో వెజిట‌బుల్ ఆయిల్ వేసి మీడియం మంట‌పై వేడి చేయాలి. అందులోనే త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం వేసి 1 నిమిషం పాటు వేయించాలి. అవి సువాస‌న వ‌చ్చాక అందులోనే త‌రిగిన ప‌చ్చి మిర్చి వేసి 30 సెక‌న్ల‌పాటు వేయించాలి. అనంత‌రం సోయా సాస్‌, తేనె, వెనిగ‌ర్‌, చిల్లీ సాస్‌, కెచ‌ప్ వేసి బాగా కల‌పాలి. మీకు సాస్ మందంగా కావాలంటే నీళ్లు క‌లిపిన కార్న్ ఫ్లోర్ పిండిని వేసి క‌ల‌పాలి. అనంత‌రం బాగా వేయించాలి. త‌రువాత అవ‌సరం అనుకుంటే రుచి కోసం నువ్వుల నూనె వేసుకోవ‌చ్చు.

అనంత‌రం ముందుగా వేయించి పెట్టుకున్న కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. మ‌రో 2-3 నిమిషాల పాటు అన్నీ క‌లుపుతూ బాగా వేయించాలి. దీంతో హ‌నీ చిల్లీ కాలిఫ్ల‌వ‌ర్ రెడీ అవుతుంది. దీనిపై చివ‌ర్లో నువ్వులు, ఉల్లికాడ‌లు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవ‌చ్చు. దీంతో ఎంతో రుచిగా ఉండే హ‌నీ చిల్లీ కాలిఫ్ల‌వ‌ర్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ట‌మాటా సాస్ వేసి తిన‌వ‌చ్చు. తోడుగా ప‌చ్చి ఉల్లిపాయ‌, నిమ్మ‌ర‌సంతోనూ తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అంద‌రికీ న‌చ్చుతాయి.

Tags: Honey Chilli Cauliflower
Previous Post

Cucumber And Pineapple Drink : మెరిసే చ‌ర్మం కావాలా ? కీర‌దోస‌, పైనాపిల్‌తో చేసే ఈ డ్రింక్‌ను రోజూ తాగండి..!

Next Post

Sunflower Seeds : పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను ఉద‌యం తిన‌వ‌చ్చా..?

Related Posts

వినోదం

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

May 31, 2025
information

పొరపాటున కూడా ఈ వస్తువుల‌ను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!