Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Semiya Cutlet Recipe : సేమియాతో ఎంతో క్రిస్పీగా రుచిగా ఉండే క‌ట్‌లెట్స్‌.. త‌యారీ ఇలా..!

D by D
October 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Semiya Cutlet Recipe : సేమియాతో మ‌నం పాయ‌స‌మే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. సేమియాతో చేసే ఈ చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. సేమియాతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో సేమియా క‌ట్లెట్స్ కూడా ఒక‌టి. సేమియా, బంగాళాదుంప‌తో చేసే ఈ క‌ట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భంం. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ సేమియా క‌ట్లెట్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సేమియా క‌ట్లెట్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దంచిన ధ‌నియాలు – ఒక టీ స్పూన్, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, బొంబాయి ర‌వ్వ – 2 టీ స్పూన్స్, ఉడికించి తురిమిన బంగాళాదుంప‌లు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర -కొద్దిగా, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, మైదాపిండి – 2 లేదా 3 టీ స్పూన్స్, సేమియా – అర కప్పు , నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Semiya Cutlet Recipe make like this crispy
Semiya Cutlet Recipe

సేమియా క‌ట్లెట్స్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క్యారెట్ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ర‌వ్వ వేసి క‌ల‌పాలి. త‌రువాత బంగాళాదుంప‌ల తురుమును వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌సుపు,ఉప్పు, కొత్తిమీర‌, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని పిండి ముద్ద‌లా ద‌గ్గ‌ర పడే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి ప‌లుచ‌గా క‌లుపుకోవాలి.

త‌రువాత బంగాళాదుంప మిశ్ర‌మాన్ని తీసుకుని క‌ట్లెట్ లాగా వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వీటిని ఒక్కొక్క‌టిగా మైదాపిండిలో ముంచాలి. త‌రువాత సేమియాతో కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌ట్లెట్ ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండువైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా క‌ట్లెట్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సేమియాతో త‌రుచూ పాయ‌స‌మే కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తిన‌వ‌చ్చు. వీటిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

Tags: Semiya Cutlet Recipe
Previous Post

Healthy Foods : మీ ఆయుష్షు పెర‌గాలంటే.. ఈ 5 ఫుడ్స్‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి..!

Next Post

Bendakaya Palli Karam : బెండ‌కాయ ప‌ల్లికారం ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Related Posts

sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

June 1, 2025
వినోదం

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!