Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ పేరు చెబితే చాలు.. ముందుగా మనకు వివాదాలే గుర్తుకు వస్తాయి. ఈమె ఎల్లప్పుడూ ఎవరో ఒకరిపై కామెంట్లు చేస్తూ ఉంటుంది. అవి వివాదాస్పదం అవుతూ ఉంటాయి. దీంతో ఈమె వార్తల్లో నిలుస్తుంటుంది. ఎక్కువగా ఈమె పవన్ కల్యాణ్ మీద సెటైర్లు వేస్తుంటుంది. దీంతో ఈమెను పవన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతుంటారు. అయినా ఈమె అవన్నీ పట్టించుకోదు. తన పనితాను చేసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి సొంతంగా యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ అందులో అనేక రకాల వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. చూస్తుంటే ఈమె వంట చేయడంలో చేయి తిరిగిన మనిషిలా కనిపిస్తోంది.
ఇక తాజాగా శ్రీరెడ్డి.. తనకు ఉన్న చేపల చెరువులో బంగారు తీగ అనే చేపలను పట్టింది. అంతటితో ఆగలేదు. వాటిని స్వయంగా శుభ్రం చేసి వాటితో చేపల పులుసు చేసింది. అనంతరం ఆ వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె వీడియో వైరల్‌గా మారింది. చాలా మంది ఆమె చేసిన చేపల పులుసును మెచ్చుకుంటున్నారు. వివాదాలను పక్కన పెడితే ఆమె చానల్‌కు మంచి ఆదరణే లభిస్తోంది. ఆమె పెట్టే వంటల వీడియోలకు భారీగా వ్యూస్ కూడా వస్తున్నాయి.
కాగా శ్రీరెడ్డి తన చానల్‌లో ఇప్పటికే అనేక వంటల వీడియోలను పోస్ట్ చేసింది. అలాగే అందులో పలు ఇతర అంశాలపై కూడా మాట్లాడుతూ వీడియోలు పెడుతుంటుంది. ఏది ఏమైనా శ్రీరెడ్డి తాజాగా చేసిన చేపల పులుసు వీడియో మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె చేసిన చేపల పులుసును తినాలని ఉందని చాలా మంది కామెంట్లు కూడా చేస్తుండడం విశేషం.