Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tandoori Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే తందూరి చికెన్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

D by D
October 12, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tandoori Chicken : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, హోటల్స్ లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో తందూరి చికెన్ కూడా ఒక‌టి. తందూరి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు కూడా. అయితే ఈ తందూరి చికెన్ ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాద‌ని భావిస్తూ ఉంటారు. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి తందూర్ లేదా ఒవెన్ ఉండాలి అని అనుకుంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఈ తందూరి చికెన్ ను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎటువంటి ఒవెన్ లేకుండా చాలా త‌క్కువ నూనెతో స్మోకి ప్లేవ‌ర్ తో ఇంట్లోనే తందూరి చికెన్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఒవెన్ లేకుండా ఇంట్లోనే తందూరి చికెన్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తందూరి చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్దగా ఉండే చికెన్ ముక్క‌లు – 2, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, తందూరిమ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ఫుడ్ క‌ల‌ర్ – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

Tandoori Chicken recipe follow this simple method
Tandoori Chicken

తందూరి చికెన్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ముక్క‌ల‌కు రెండు వైపులా గాట్లు పెట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి అర‌గంట పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో పెరుగు, కారం, తందూరి మ‌సాలా, ఉప్పు, గ‌రం మ‌సాలా, క‌సూరి మెంతి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముక్క‌ల‌కు ప‌ట్టించాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి ఫ్రిజ్ లో ఉంచి మ‌న స‌మ‌యాన్ని బ‌ట్టి 3 నుండి 10 గంట‌ల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న త‌రువాత ముక్క‌ల‌కు క‌ల‌ర్ ను ప‌ట్టించాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌ల‌ను వేసి పెద్ద మంట‌పై రెండు వైపులా 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. త‌రువాత మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి కాల్చుకోవాలి. ఈ ముక్క‌ల‌ను మూడు నిమిషాలకొక‌సారి అటూ ఇటూ తిప్పుతూ పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

అవ‌స‌ర‌మైతే మ‌ధ్య మ‌ధ్య‌లో కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకోవాలి. చికెన్ ముక్క‌లు పూర్తిగా వేగిన త‌రువాత బొగ్గు ముక్క‌ను తీసుకుని మంట‌పై బాగా కాల్చాలి. త‌రువాత దీనిని ఒక గిన్నెలో వేసి చిఎన్ ముక్క‌ల మ‌ధ్య‌లో ఉంచాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి బొగ్గుపై కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముక్క‌ల‌కు స్మోకి ప్లేవ‌ర్ వ‌స్తుంది. త‌రువాత ముక్క‌ల‌ను తీసి ప్లేట్ లో వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగాఉండే తందూరి చికెన్ త‌యార‌వుతుంది. స్నాక్స్ గా, సైడ్ డిష్ గా, స్టాట‌ర్ గా దీనిని తిన‌వ‌చ్చు. ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా తందూరి చికెన్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Tandoori Chicken
Previous Post

Foods For Long Hair : ఈ 7 ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ జుట్టు వ‌ద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!

Next Post

Konaseema Kodi Pulao : కార‌కారంగా కోన‌సీమ కోడి పులావ్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో మరిచిపోరు..!

Related Posts

ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025
వైద్య విజ్ఞానం

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

July 5, 2025
technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

July 5, 2025
technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.