Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌ణ‌ మిన‌ర‌ల్స్

అయోడిన్‌ మనకు ఎందుకు అవసరం ? లోపం లక్షణాలు, అయోడిన్‌ ఉండే ఆహారాలు..!

Admin by Admin
April 27, 2021
in మిన‌ర‌ల్స్
Share on FacebookShare on Twitter

మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల మినరల్స్‌లో అయోడిన్‌ కూడా ఒకటి. ఇది సూక్ష్మ పోషకం. అంటే దీన్ని నిత్యం మనం తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయోడిన్‌ వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. దీన్ని మన శరీరం నిత్యం ఉపయోగించుకుంటుంది.

iodine uses deficiency symptoms iodine foods in telugu

అయోడిన్‌ ఉపయోగాలు

మన శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి ఆరోగ్యంగా ఉండేందుకు, ఆ గ్రంథి సరిగ్గా పనిచేసేందుకు అయోడిన్‌ అవసరం. అలాగే గర్భంలో ఉన్న శిశువు నాడీ మండల వ్యవస్థ ఎదుగుదలకు, పుట్టే పిల్లలు సరైన బరువును కలిగి ఉండేందుకు, స్త్రీలలో వక్షోజాల సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలన్నా, బాక్టీరియా, వైరస్‌ల నుంచి మనకు రక్షణ కల్పించేందుకు.. అయోడిన్‌ అవసరం అవుతుంది. అందువల్ల ఇది ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది.

నిత్యం మనకు అయోడిన్‌ ఎంత మోతాదులో అవసరం అంటే ?

  • అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 6 నెలల వయస్సు వారికి రోజుకు 110 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం అవుతుంది.
  • 7 నుంచి 12 నెలల మధ్య వయస్సు వారికి రోజుకు 130 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం.
  • 1 నుంచి 8 ఏళ్ల వయస్సు వారు నిత్యం 90 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాలి.
  • 9 నుంచి 13 ఏళ్ల వారికి 120 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం.
  • 14 ఏళ్లు అంతకన్నా పైబడిన వారు 150 మైక్రోగ్రాముల అయోడిన్‌ను నిత్యం తీసుకోవాలి.
  • గర్భిణీలకు నిత్యం 220 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం.
  • పాలిచ్చే తల్లులు నిత్యం 290 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

అయోడిన్‌ లోపం లక్షణాలు

శరీరంలో అయోడిన్‌ లోపిస్తే మెడ దగ్గర వాపు కనిపిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి వాపునకు గురై టచ్‌ చేస్తే నొప్పి అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో, నిద్రించడంలో ఇబ్బందులు వస్తాయి. మింగడం కష్టమవుతుంది. తీవ్రమైన అలసట ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ బాగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. వెంట్రుకలు రాలిపోతుంటాయి. డిప్రెషన్‌ వస్తుంది. అధికంగా బరువు పెరుగుతారు.

పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే అయోడిన్‌ లోపం ఉన్నట్లు గుర్తించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని ఆ మేరకు చికిత్స తీసుకోవాలి. అయోడిన్‌ లోపం ఉంటే వైద్యులు సప్లిమెంట్లు ఇస్తారు. అయితే అయోడిన్‌ ను నిత్యం మోతాదుకు మించి తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. వికారంగా, వాంతికి వచ్చినట్లు ఉంటుంది. విరేచనాలు అవుతాయి. జ్వరం వస్తుంది. గొంతు, నోరు మండినట్లు అనిపిస్తుంది. కడుపులో నొప్పి ఉంటుంది. అయోడిన్‌ సప్లిమెంట్లను వాడేవారు ఆయా లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలి. తేడా అనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.

అయోడిన్‌ ఉండే ఆహారాలు

క్రాన్‌ బెర్రీలు, ఆలుగడ్డలు (బంగాళాదుంపలు), స్ట్రాబెర్రీలు, మొక్కజొన్న, ప్రూన్స్‌, అరటి పండ్లు, బీన్స్‌, పాలకూర, కొబ్బరినూనె, బ్రొకొలి, హిమాలయన్‌ సాల్ట్‌, సోంపు గింజల ఆకు, సముద్రపు ఉప్పు, అయోడైజ్డ్‌ సాల్ట్‌, సముద్రపు చేపలు, పెరుగు, కోడిగుడ్లు, టర్కీ మాంసం తదితర ఆహారాల్లో మనకు అయోడిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అయోడిన్‌ లోపం రాకుండా ఉంటుంది.

Tags: iodineiodine deficiency symptomsiodine foodsiodine usesఅయోడిన్‌అయోడిన్ ఆహారాలుఅయోడిన్ ఉప‌యోగాలుఅయోడిన్ ప్ర‌యోజ‌నాలుఅయోడిన్ లాభాలుఅయోడిన్ లోపం ల‌క్ష‌ణాలు
Previous Post

హైపో, హైపర్‌ థైరాయిడిజంకు మధ్య తేడాలు.. కన్‌ఫ్యూజ్‌ అవకండి..!

Next Post

ఏయే అనారోగ్య సమస్యలకు ఏయే పండ్లు, కూరగాయలు పనిచేస్తాయంటే..?

Related Posts

మిన‌ర‌ల్స్

Calcium Rich Foods : పాల‌లో క‌న్నా కాల్షియం వీటిల్లో వంద రెట్లు ఎక్కువ‌.. పైసా ఖ‌ర్చు ఉండ‌దు..!

December 8, 2023
మిన‌ర‌ల్స్

Magnesium Deficiency : గుండె ఎక్కువ‌గా కొట్టుకుంటూ కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే ఏం చేయాలంటే..?

June 6, 2023
మిన‌ర‌ల్స్

Iron Foods : వీటిని తీసుకుంటే చాలు.. శ‌రీరంలో ఐర‌న్ అమాంతంగా పెరుగుతుంది.. ర‌క్త‌హీన‌త ఉండ‌దు..

April 9, 2023
మిన‌ర‌ల్స్

Zinc Foods : వీటిని తింటే న‌ర‌న‌రాల్లోనూ బ‌లం పెరుగుతుంది.. మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..

February 14, 2023
మిన‌ర‌ల్స్

Thati Bellam For Iron : దీన్ని తింటే ర‌క్తం బాగా ప‌డుతుంది.. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు..

January 29, 2023
మిన‌ర‌ల్స్

Iron Deficiency : శ్వాస ఆడ‌క‌పోవ‌డం, వికారంగా ఉండడం వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే ఇందుకు కార‌ణం ఇదే..!

January 10, 2023

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.