Jackfruit : వేసవిలో మనకు అందుబాటులో ఉండే పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి నవంబర్, డిసెంబర్ నెలలతోపాటు మార్చి నుంచి జూన్ వరకు మనకు లభిస్తాయి. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. అయితే అవి సహజసిద్ధమైన చక్కెరలే. కనుక మధుమేహం ఉన్నవారు కూడా ఈ పండ్లను నిర్భయంగా తినవచ్చు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇక పనస పండ్లను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పనస పండ్లలో ఉంటాయి. కనుక వీటిని ఈ సీజన్‌లో అసలు విడిచిపెట్టకుండా తినాలి. వీటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పనస పండ్లు శాకాహారులకు అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే మాంసాహారం తినలేని వారు ఈ పండ్లను తింటే వారికి ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. కనుక శాకాహారులు పనస పండ్లను తినవచ్చు. దీని వల్ల మాంసాహారం తిన్నటువంటి లాభాలు కలుగుతాయి. అందుకనే పనస పండ్లను వెజిటబుల్ మీట్ అని కూడా పిలుస్తారు. 100 గ్రాముల పనస పండ్లను తినడం వల్ల మనకు 94 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పండ్లను తింటే ఉత్సాహం వస్తుంది. నీరసంగా ఉన్నవారు, బాగా అలసి పోయినవారు, రోజంతా శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువగా చేసే వారు.. ఈ పండ్లను తింటే.. వెంటనే శక్తిని పొందవచ్చు. దీంతో చురుగ్గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు.
పనస పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పండ్లను తింటే 2 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం సమస్యలను తగ్గించడంతోపాటు అధిక బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ పండ్లలో పొటాషియం దండిగా ఉంటుంది. 100 గ్రాముల పనస పండ్లను తింటే 303 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలో కాల్షియం కూడా ఎక్కువే. 100 గ్రాముల పనస పండ్లను తింటే 34 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఇక గర్భిణీలకు ఈ పండ్లు ఎంతగానో దోహదపడతాయి. వీటిల్లో 14 మైక్రోగ్రాముల ఫోలేట్ లభిస్తుంది. ఇది బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో అవసరం అయ్యే పోషక పదార్థం. కనుక గర్భిణీలు పనస పండ్లను ఎక్కువగా తినాలి.
ఈ పండ్లలో ఐరన్ కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇక పనస పండ్లలో ఉండే విటమిన్లు ఎ, సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. ఈ పండ్లలో థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మనల్ని రోగాల బారి నుంచి రక్షిస్తాయి. పనస పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీని వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు రావు.
క్యానర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు పనస పండ్లలో ఉంటాయి. వీటిల్లో ఫైటో న్యూట్రియెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్‌లు రాకుండా చూస్తాయి. పనస పండ్లను తినడం వల్ల శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నశించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దీంతో చర్మ కణాలు మరమ్మత్తులకు గురవుతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ఆస్తమా ఉన్నవారు పనస పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇవి శ్వాసకోశ వ్యవస్థలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. దీంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను తింటే శరీర మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది. దీంతోపాటు థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే చర్మ సమస్యలు, జ్వరం ఉన్నవారు పనస పండ్లను తింటే ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.