రుచికి పుల్లగా ఉన్నప్పటికీ పైనాపిల్స్‌ను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వీటిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. పైనాపిల్స్‌ను తరచూ తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలు నయం అవుతాయి.
ఒక కప్పు పైనాపిల్ పండ్ల ద్వారా మనకు 82 క్యాలరీల శక్తి లభిస్తుంది. వీటిలో ఫైబర్, విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ బి6, కాపర్, థయామిన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నిషియం, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, ఐరన్‌లు లభిస్తాయి. దీంతో శరీరానికి పోషణ లభిస్తుంది.
పైనాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ అనబడే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేస్తుంది. మాంసాహారం తిన్నవారు పైనాపిల్ పండ్లను తింటే త్వరగా ఆ ఆహారం జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
పైనాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బ్రొమెలెయిన్ ఎంజైమ్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. అందువల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
పైనాపిల్ పండ్లను తినడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మన శరరీంలో చేరే సూక్ష్మ క్రిములు ఎప్పటికప్పుడు నశిస్తాయి.
ఆర్తరైటిస్ సమస్య ఉన్నవారు పైనాపిల్ పండ్లను తరచూ తింటుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పైనాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి.
శస్త్ర చికిత్స అయిన వారు పైనాపిల్ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. ఈ పండ్లను నేరుగా తినవచ్చు. వీటితో జ్యూస్ చేసుకుని తాగవచ్చు. లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి.