Dragon Fruit : చూసేందుకు పింక్ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్‌ను సాధారణంగా చాలా మంది తినేందుకు ఇష్టపడరు. ఎందుకంటే ఇవి అంతగా రుచిగా ఉండవు. అయితే వాస్తవానికి డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సీజన్లలో ఈ పండ్లను తింటే ఎన్నో లాభాలను పొందవచ్చని అంటున్నారు. ఇక డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేస్తుంది. అలాగే శరీరం కూడా ఇన్సులిన్‌ను సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి డ్రాగన్ ఫ్రూట్‌ను వరం అనే చెప్పవచ్చు. ఇక ఈ పండ్లను తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, బీటాసయనిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల డ్రాగన్ ఫ్రూట్‌ను తింటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే డయాబెటిస్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. దీని వల్ల రోగాలు రావు. అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వచ్చినా వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్, కడుపులో మంట, మలబద్దకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండ్లను తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ సైతం తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇక ఈ పండ్లను తింటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. వయస్సు మీద పడినా చర్మంపై ముడతలు కనిపించవు. ఇలా డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని తినడం మరిచిపోకండి.