Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం న‌ట్స్ & సీడ్స్

వేరుశనగలు (పల్లీలు) తింటున్నారా ? అయితే ఈ విషయాల‌ను తప్పకుండా తెలుసుకోండి..!

D by D
August 7, 2022
in న‌ట్స్ & సీడ్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మ‌నం ఆహారంలో భాగంగా ప‌ల్లీల‌ను కూడా తీసుకుంటూ ఉంటాము. ప‌ల్లీల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం ప‌ల్లీల‌ను ఉడికించి, నేరుగా లేదా వేయించి తింటూ ఉంటాం. అలాగే వంట‌ల్లో కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటాం. స‌ర‌దాగా కాల‌క్షేపం కోసం తినే ఈ ప‌ల్లీల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మ‌నం ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లీల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల మాంస‌కృత్తులు, పీచు ప‌దార్థాలు, పిండి ప‌దార్థాల వంటి అనేక ర‌కాల పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా మ‌న ఆరోగ్యానికి మేలు చేసే 13 ర‌కాల విట‌మిన్స్, 26 ర‌కాల ఖ‌నిజాలు పుష్క‌లంగా ఉంటాయి. ప‌ల్లీల‌ను వేయించి బెల్లంతో క‌లిపి తిన‌డం వ‌ల్ల వికారం క‌ల‌గ‌కుండా ఉండ‌డంతోపాటు ర‌క్త వృద్ధి కూడా క‌లుగుతుంది.

you must know these things about peanuts

త‌ర‌చూ ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల త‌గినంత శ‌క్తి ల‌భించి మ‌నం చురుకుగా ప‌ని చేసుకోగ‌లుగుతాం. అంతేకాకుండా మెద‌డు ప‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది. పిల్ల‌ల‌కు వీటిని త‌ర‌చూ ఆహారంగా ఇవ్వ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా ప‌ని చేయ‌డంతోపాటు జ్ఞాప‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు క‌రిగి గుండె ప‌నితీరు మెరుగుప‌డడంతోపాటు గుండె సంబంధిత స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

వీటిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచే గుణం కూడా ప‌ల్లీల‌కు ఉంటుంది. వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. గ‌ర్భిణీ స్త్రీలు, బాలింత‌లు ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ప‌ల్లీలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఈ గింజ‌ల్లో మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌ర‌మ‌య్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జుట్టు కుదుళ్లు కూడా బ‌లంగా త‌యారవుతాయి. చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌ల‌ను తొల‌గించ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా చేయ‌డంలో కూడా ప‌ల్లీలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ప‌చ్చి ప‌ల్లీల‌కు కొద్దిగా ఉప్పును కలిపి తిన‌డం వ‌ల్ల చిగుళ్లు గ‌ట్టిప‌డ‌తాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి క‌దా అని వీటిని ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు.

ప‌ల్లీల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రిలో ఎల‌ర్జీ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఆస్త‌మా ఉన్న వారు ప‌ల్లీల‌ను త‌క్కువ మోతాదులో తీసుకోవాలి. వేయించిన ప‌ల్లీల‌ను తిన‌డం కంటే ఉడ‌క‌బెట్టిన ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అధిక పోష‌కాల‌ను పొంద‌గ‌ల‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌ల్లీల‌ను ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని, వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: peanuts
Previous Post

మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుతున్నారా ? అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే.. లేదంటే న‌ష్ట‌పోతారు..

Next Post

ఈ మొక్క ఆకుల‌ను ఉప‌యోగిస్తే.. ఎలాంటి నొప్పులు అయినా స‌రే క్ష‌ణాల్లో మాయ‌మ‌వుతాయి..!

Related Posts

వ్యాయామం

ఎక్స‌ర్‌సైజ్ చేసే వారు స‌డెన్‌గా దాన్ని ఆపేస్తే… లావై పోతారా? ఇందులో నిజమెంత??

July 12, 2025
హెల్త్ టిప్స్

మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు?.. 6 గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
హెల్త్ టిప్స్

చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 12, 2025
పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

బైపాస్ సర్జ‌రీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

July 12, 2025
హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.