Brinjal : రంగు రంగుల వంకాయ‌లు.. వీటిల్లో ఏవి తింటే మంచిది..?

Brinjal : వంకాయ‌వంటి కూర‌యు.. పంక‌జ‌ముఖి సీత వంటి భామామ‌నియున్.. అంటూ వంకాయ మ‌న వంట‌కాల్లో ఓ ముఖ్య‌మైన ప్లేస్ ను కొట్టేసింది. అలాంటి వంకాయ‌కు సంబంధించి మార్కెట్ లో రెండు ర‌కాలు దొరుకుతున్నాయి. 1) గ్రీన్ క‌ల‌ర్ వంకాయ‌లు 2) వ‌యొలెట్ క‌ల‌ర్ వంకాయ‌లు. ఈ రెండిటిలో ఏవి తింటే మంచిది ? వేటి వ‌ల్ల మ‌న‌కు లాభాలు ఎక్కువ‌గా క‌లుగుతాయి..? వేటిని తినాలి..? వ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్, వ‌యొలెట్‌.. రెండింటిలోనూ వ‌యొలెట్ క‌ల‌ర్ వంకాయ ది బెస్ట్ అని చెప్ప‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే.. వ‌యొలెట్‌ క‌ల‌ర్ లో మ‌న‌కు తిన‌డానికి దొరికేవి రెండే రెండు 1) వంకాయ 2) నేరేడు (జామూన్). కాబ‌ట్టి.. వ‌యొలెట్ క‌ల‌ర్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందువ‌ల్ల వ‌యొలెట్ క‌ల‌ర్‌లో ఉండే వంకాయ‌ల‌ను తింటేనే మ‌న‌కు అధికంగా లాభాలు క‌లుగుతాయి.

Brinjal or Eggplant which type of color we have to take
Brinjal

గ్రీన్ తో పోల్చితే వ‌యొలెట్ క‌ల‌ర్ వంకాయ పెరిగే క్ర‌మంలో సూర్యుని నుండి అధిక కాంతిని గ్ర‌హిస్తుంది. అధిక సూర్య ర‌శ్మిని ఉప‌యోగించుకుంటూ పెరిగిన మొక్క‌ల నుండి వ‌చ్చే ఆహార ప‌దార్థాలు తిన‌డానికి చాలా శ్రేయస్క‌రం. క‌నుక వ‌యొలెట్ క‌ల‌ర్ వంకాయ‌లు శ్రేయ‌స్క‌రం అని చెప్ప‌వ‌చ్చు. ఇక వంకాయ విష‌యంలో చాలా అపోహ‌లున్నాయి. వంకాయ వాతం, బ‌రువు పెరుగుతారు అంటారు. కానీ వ‌యొలెట్ క‌ల‌ర్ వంకాయను క‌డుపునిండా తినొచ్చు. జొన్న‌రొట్టె, స‌జ్జ రొట్టెతో వంకాయ కూర‌ను క‌లిపి తింటే చాలా మంచిది.

వంకాయల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇవి క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి. క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో స‌హ‌క‌రిస్తాయి. గుండె జ‌బ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్స్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఇలా వ‌యొలెట్ క‌ల‌ర్‌లో ఉన్న వంకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts