Cauliflower : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. దాదాపు సంవత్సరమంతా కాలీఫ్లవర్ లభించినప్పటికి చలికాలంలో మరింత ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. మనం కాలీఫ్లవర్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కాలీఫ్లవర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే కొందరు కాలీఫ్లవర్ ను తినడానికి ఇష్టపడరు. కానీ ఇతర కూరగాయల వలె కాలీఫ్లవర్ ను కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలీఫ్లవర్ లో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిలో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్స్, పాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో కూడా కాలీఫ్లవర్ మనకు దోహదపడుతుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. రోజూ ఉండయం పరగడుపున కాలీఫ్లవర్ జ్యూస్ ను తాగడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండి రక్తహీనత సమస్యతో బాధపడే వారు కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో కూడా కాలీఫ్లవర్ మనకు దోహదపడుతుంది. వారంలో రెండు సార్లు కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి హైపర్ థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల టి3, టి4 హార్మోన్లు మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే కాలీఫ్లవర్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడే వారు కూడా దీనిని తీసుకోకపోవడమే మంచిది.