Healthy Foods : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలా అనారోగ్య సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం మారిన మన ఆహారపు అలవాట్లు, మన జీవన శైలే అని చెప్పవచ్చు. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినడం, ఎప్పుడూ పడితే అప్పుడు తినడం వంటివి చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. అసలు మనం ఉదయం లేచిన తరువాత ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి.. వేటిని తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట చక్కటి ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఉదయం పూట చాలా మంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కనుక తేలికగా ఉండడంతో పాటు ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవాలి.
ఉదయం పూట ఎక్కువగా అరటి పండు, ఎండు ద్రాక్ష, బాదం పప్పును ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా వీటిని తీసుకోవడం వల్ల ఈ ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి చక్కగా అందడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. ఉదయం పూట రకరకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. అదే సమయంలో మన ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన శరీరతత్వాన్ని బట్టి, మనకు ఉన్న సమస్యలను బట్టి, మన లక్షణాలను బట్టి అరటి పండు, బాదం, ఎండు ద్రాక్షను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, నీరసం వంటి సమస్యలతో బాధపడే వారు ఉదయం పూట ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకోవడం మంచిది.
అరటి పండు ఇష్టం లేని వారు ఇతర పండ్లను కూడా తీసుకోవచ్చు. అలాగే డయాబెటిస్ తో బాధపడే వారు, ఊబకాయంతో బాధపడే వారు, కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు, చర్మ పొడిబారడం వంటి సమస్యలతో బాధపడే వారు నానబెట్టిన బాదంపప్పును పొట్టును తీసి ఖాళీ కడుపున తినాలి. అదే విధంగా రుతుక్రమం సరిగ్గా లేని స్త్రీలు నానబెట్టిన ఎండు ద్రాక్షలను ఉదయం పూట ఖాళీ కడుపుతో తినాలి. అలాగే మూడ్ స్వింగ్స్, రక్తహీనత, నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఉదయం పూట ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీటిని తీసుకునే ముందు ఒక గ్లాస్ నీటిని కూడా తాగాలి. ఈ విధంగా మన అనారోగ్య సమస్యలను బట్టి మన శరీరతత్వాన్ని బట్టి ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.