ఆల్బర్ట్ ఐన్‌స్టీన్..! ఈ పేరు గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి ఉండదేమో..! ఎందుకంటే ప్రతి మనిషికి తన విద్యార్థి దశ నుంచే ఈయన పేరు తెలుసు. పాఠశాల, కాలేజీల్లో ఐన్‌స్టీన్ పేరు లేకుండా సైన్స్ పుస్తకాలే ఉండవు. ఎందుకంటే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు అటువంటివి మరి. వాటిని ఇప్పటికీ వాడుతున్నారంటే అది ఆయన చలవే. అయితే విషయ పరిజ్ఞానం పరంగా ఐన్‌స్టీన్ అపర మేథావి. కానీ… తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన తన భార్యకు పెట్టిన షరతులు చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. అవును, మీరు విన్నది కరెక్టే..! కనీసం సెక్స్ చేయడానికి కూడా తన భార్యకు కఠినమైన కండిషన్స్ పెట్టేవారట.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మొదటి భార్య పేరు మిలెవా మారిక్. అయితే ఆమె ఐన్‌స్టీన్‌ను పెళ్లి చేసుకోక ముందే ఆమెకు ఓ పాప జన్మించింది. కానీ ఆమెను వేరే కుటుంబానికి మిలెవా దత్తత ఇచ్చేసింది. దీంతో ఆ విషయం ఐన్‌స్టీన్‌కు తెలియదు. అప్పుడే మిలెవా ఐన్‌స్టీన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందు ఐన్‌స్టీన్ మిలెవాకు కొన్ని కండిషన్స్ పెట్టారట. అవేమిటంటే…
ఐన్‌స్టీన్‌కు చెందిన బట్టలన్నింటినీ శుభ్రంగా ఉంచాలి. వాటిని రోజూ ఉతికి ఆయన కప్‌బోర్డ్‌లో నీట్‌గా సర్ది పెట్టాలి. భోజనం అందరితో కలసి చేయడు. రోజుకు 3 పూటలా మీల్స్ ఆయన రూమ్‌కే వెళ్లాలి. బెడ్రూం, స్టడీ రూం ఎల్లప్పుడూ నీట్‌గా ఉండాలి. ఆయన వాడే డెస్క్ ఆయన కాకుండా వేరే ఎవరూ వాడరాదు. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా ఆమె ఆయనతో కలసి కూర్చోరాదు. ఆయన కోరకుండా ఆమె తనంత తానుగా సెక్స్ కావాలని ఐన్‌స్టీన్‌ను అడగకూడదు. ఏవిధంగానూ సెక్స్ చేయమని ప్రేరేపించకూడదు. ఆయన కోర్కె మేరకు ఆయన చెప్పినట్టే చేయాలి. ఆయన చెబితేనే ఆమె ఆయనతో మాట్లాడాలి. లేదంటే కామ్‌గా వెళ్లి బుక్స్ చదువుకోవాలి. పిల్లల ముందు ఎప్పుడూ ఆయన్ను తక్కువగా చేసి మాట్లాడకూడదు. దుర్భాషలు ఆడరాదు.
ఈ రూల్స్‌కు మిలెవా ఒప్పుకుని ఐన్‌స్టీన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వారు 20 సంవత్సరాల పాటు కాపురం చేశాక డైవోర్స్ తీసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. మొదటి భార్యను వదిలేశాక ఐన్‌స్టీన్ తన కజిన్ ఎల్సా లొవెంథాల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని అనంతరం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన చనిపోయాక థామస్ హార్వే అనే ఓ డాక్టర్ ఐన్‌స్టీన్ మెదడును తీసి భద్రపరిచాడు. దాన్ని ఎప్పటికైనా శోధించాలనేది సైంటిస్టుల కల..!