ఎరుపు రంగు వాడడానికి కారణం ఆ రంగుకు రంగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది.అదేంటి అంటే కంటికి కనిపించే అన్ని రంగుల కన్నా ఎరుపు రంగుకు ఎక్కువ తరంగ దైర్ఫ్యం ఉంటుంది. రంగులన్నీ తరంగాల రూపంలో ప్రసార మవుతూ ఉంటాయి. అలల రూపంలో వెళుతున్న తరంగాలతో వరుసగా రెండింటి మధ్య దూరమే తరంగ దైర్ఫ్యం .
నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్నరాయిని వదిలితే చిన్న తరంగాలు,పెద్దరాయిని జారవిడిస్తే పెద్ద తరంగాలు ఏర్పడినట్లు, చిన్న తరంగాలకు తక్కువ తరంగ దైర్ఫ్యం,పెద్ద తరంగాలకు ఎక్కువ తరంగ దైర్ఫ్యం ఉంటుంది.పెద్ద తరంగాలు ఎక్కువ దూరం కనిపించడానికి కారణం వాటి తరంగ దైర్ఫ్యమే.
రంగులు కనిపించే సమయంలో కూడా ఇదే లక్షణం వర్తిస్తుంది.ఎక్కువ తరంగ దైర్ఫ్యమున్నా ఎరుపు రంగు ఎక్కువ దూరం కనిపిస్తుంది. అందుకే ప్రమాద సూచికగా ఎరుపు రంగును వాడుతారు.