Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

Spirulina : తల్లిపాలకు సమానంగా పోషకాలు కలిగిన మొక్క.. అస‌లు విడిచిపెట్ట‌కండి..!

Editor by Editor
May 9, 2023
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Spirulina : పిల్లలకు శ్రేష్టమైన ఆహారాల్లో తల్లిపాలు ముందుంటాయి. ఎటువంటి కల్తీలేనివి కూడా తల్లిపాలే. ప్రతిదీ కల్తీ జరుగుతుందని భయపడుతూ ఏం తినాలన్నా అనుమాన‌ప‌డుతున్న‌ మనం తల్లిపాల విషయంలో హ్యాపీగా ఉన్నాం. తల్లిపాలలో లభించే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలోనూ సంపూర్ణం గా దొరకవు. కానీ స్పిరులినా ఆకుల్లో త‌ల్లి పాల‌కు స‌మానంగా పోష‌కాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు.  ఇది స‌ముద్ర గ‌ర్భంలో పెరుగుతుంది. ఈ క్ర‌మంలో స్పిరులినా వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పిరులినా మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎంతంటే సాధారణ పాల‌క‌న్నా 26 రెట్లు అధికంగా. అవును. దీంతో ఎముక‌ల‌కు ఎంతో బ‌లం క‌లుగుతుంది.  దేహ నిర్మాణానికి, క‌ణ‌జాలాల మ‌ర‌మ్మ‌త్తుల‌కు, కొత్త క‌ణ‌జాలం పెరిగేందుకు ప్రోటీన్లు ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం వ‌ర‌కు ప్రోటీన్లు ఉంటాయి. మ‌న‌కు ల‌భిస్తున్న అన్ని ఆహార ప‌దార్థాల్లోకెల్లా అత్యంత గ‌రిష్టంగా ప్రోటీన్లు క‌లిగిన ఆహారం ఇదే. నాన్ వెజ్ తిన‌ని వారు దీని పొడిని తీసుకుంటే చాలు. ఎన్నో ప్రోటీన్లు ల‌భిస్తాయి. శ‌రీర పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన అమైనో యాసిడ్లు, ఐర‌న్‌, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ స‌మృద్ధిగా ఉంటాయి. ర‌క్తాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో క్లోరోఫిల్ బాగా ప‌నిచేస్తుంది.

Spirulina benefits in telugu must take it daily
Spirulina

ప‌లు ర‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. లివ‌ర్‌ను శుభ్ర ప‌రుస్తుంది. మ‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తుంది. వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. గుండె సంబంధ వ్యాధులు రావు. వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలోని హార్మోన్ల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి చ‌క్క‌ని మందుగా ప‌నిచేస్తుంది. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. విట‌మిన్లు ఎ, కె1, కె2, బి12, ఐర‌న్‌, మెగ్నిషియం, క్రోమియం, ఫైటో న్యూట్రియెంట్లు, కెరోటినాయిడ్స్‌, జీఎల్ఏ, ఎస్‌వోడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ర‌కాల పోషకాలు స్పిరులినాలో ఉన్నాయి.

క్యారెట్ల క‌న్నా 2800 శాతం బీటా కెరోటీన్‌, పాల‌కూర‌లో క‌న్నా 3900 శాతం ఎక్కువ ఐర‌న్‌, బ్లూబెర్రీల‌లో క‌న్నా 280 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పిరులినాలో ఉన్నాయి. దీన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా త‌ల్లిపాల‌తో స‌మానంగా పోష‌కాలు క‌లిగిన ఆహార ప‌దార్థాల జాబితాలో చేర్చింది. అయితే మ‌న‌కు మార్కెట్‌లో స్పిరులినా మొక్క ఆకుల‌ పొడి దొరుకుతుంది. ఈ పొడి టాబ్లెట్ల రూపంలోనూ ల‌భిస్తుంది. క‌నుక దీన్ని వాడితే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: spirulina
Previous Post

Mulakkada Sambar : మున‌క్కాడ‌ల సాంబార్ ఇలా చేయండి చాలు.. రుచి అదిరిపోతుంది..!

Next Post

Paneer Nuggets : ప‌నీర్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.